'బిగ్‌బాస్'లో డబుల్ మీనింగ్ డైలాగ్స్.. 'జబర్దస్త్'ని మించిపోయిందిగా! | Bigg Boss Telugu 7 Promo 1 & 2 - Day 45: Shivaji, Pallavi Prashanth Double Meaning Dialogues In BB House - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Promo: శివాజీ డబుల్ మీనింగ్ డైలాగ్స్.. 'బిగ్‌బాస్' ఏంటిది?

Published Wed, Oct 18 2023 5:03 PM | Last Updated on Wed, Oct 18 2023 7:03 PM

Bigg Boss Telugu 7 Promo Latest Sivaji Pallavi Prasanth - Sakshi

బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ ఉన్నంతలో ఓ మాదిరిగా నడుస్తోంది. గొడవలు, అరుపులు, నామినేషన్స్, ఎలిమినేషన్స్‌తో అలా అలా సాగుతోంది. వారం పదిరోజుల క్రితం వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్స్ అని చెప్పి ఐదుగురిని తీసుకొచ్చారు గానీ పెద్దగా మార్పేం రాలేదు. ఇన్నాళ్ల మాటల విషయంలో కాస్త కంట్రోల్ గా ఉన్నోళ్లు ఇప్పుడు ఆ ఒక్క విషయంలో హద్దులు దాటేశారు! డబుల్ మీనింగ్ మాటలతో రెచ్చిపోయారు.

(ఇదీ చదవండి: Bigg Boss 7లో భోలె గలీజు పురాణం.. ఆడపిల్లలని చూడకుండా ఆ కామెంట్స్!)

ఇంతకీ ఏమైంది?
బిగ్‌బాస్ 7లో ప్రస్తుతం ఏడోవారం నడుస్తోంది. భోలె, అశ్విని, తేజ, ప్రశాంత్, పూజా, అమరదీప్, గౌతమ్ నామినేట్ అయ్యారు. సోమ,మంగవారాల్లో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. బుధవారం నుంచి కెప్టెన్సీ టాస్క్ మొదలుకానుంది. అయితే హౌస్ అంతా మరీ సీరియస్‌గా ఉందని చెప్పి కెప్టెన్సీ కోసం చిన్న ఫన్నీ టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా రెండు పల్లెటూళ్లు, అందులోని క్యారెక్టర్స్ అని అందరూ ఆయా పాత్రలిచ్చారు. అంతా బాగానే ఉంది కానీ శివాజీ, ప్రశాంత్‌ చెప్పిన డైలాగ్స్ శ్రుతిమించినట్లు అనిపించాయి.

ఏం డైలాగ్స్?
ఈ టాస్కులో భాగంగా ప్రశాంత్ 'అన్నా తిప్పేద్దునా' అని అంటే.. పక్కనే ఉన్న అశ్విని.. 'ఏంటిరా నువ్వు నన్ను తిప్పేది' అని అంటుంది. దీనికి బదులుగా 'నా చెంచా' అని ప్రశాంత్ అంటాడు. ఇంతలో శివాజీ అక్కడికొచ్చి.. 'ఊరుని ఒక ఊపు ఊపుతున్నవటా కదా' అని అంటాడు. 'ఇంత అందగత్తెని మరి ఆ మాత్రం ఊపనా ఏంటి?' అని అశ్విని అంటుంది. 'నీ అందం ఏంటో చూద్దాం తోటకి రా ఓసారి' అని శివాజీ కౌంటర్ ఇస్తాడు. పక్కనే ఉన్న సందీప్.. 'ఓ పెద్దాయన చాలా లేతాకు' అంటే, దానికి శివాజీ కౌంటర్ ఇస్తూ.. 'ఆకేదైనా ఆకే కదరా, మేము సున్నం రాస్తాం' అని అంటాడు. సరిగ్గా గమనిస్తే మాట్లాడే విషయంలో హద్దులు దాటేశారా అని డౌట్ వస్తుంది. అలానే ఇలాంటి డైలాగ్స్ విషయంలో 'జబర్దస్త్' షోని మించిపోతున్నారుగా అనే సందేహం రాకమానదు.

(ఇదీ చదవండి: స్టార్ హీరో 25వ సినిమా.. 25 వేల మందికి అన్నదానం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement