బిగ్‌బాస్ ఏ సీజన్ తీసుకున్నా సరే కచ్చితంగా లేడీస్ కలరింగ్ ఉంటుంది. హాట్‌బ్యూటీస్‌నే వీలైనంత వరకు బిగ్ బాస్ ఆర్గనైజర్స్ తీసుకొస్తుంటారు. అలా ఈసారి వచ్చిన వాళ్లలో అశ్విని తన గ్లామర్‌తో ఆకట్టుకుంటోంది. గేమ్-గొడవల పరంగా పర్లేదనిపిస్తున్న ఈ బ్యూటీకి సంబంధించిన ఓ ఆసక్తికర విషయం ఇప్పుడు వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: తుస్సుమన్న కొత్త సినిమాలు.. తొలిరోజు కలెక్షన్స్ ఎంతంటే?)
తెలుగు సినిమాల్లో నటిగా చిన్నాచితకా పాత్రలు చేసిన అశ్విని శ్రీకి గుర్తింపు అయితే రాలేదు. దీంతో కష్టపడి బిగ్‌బాస్ 7వ సీజన్ లో అడుగుపెట్టింది. గ్లామర్ చూపించడంలో ఎలాంటి మొహమొటం చూపించట్లేదు. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా హౌసులోకి వచ్చిన ఈమె.. మొదటినుంచి భోలెతో ఎక్కువగా ఉంటూ వస్తోంది. ఈవారం అతడు ఎలిమినేట్ కానున్నాడని అంటున్నారు. ఒకవేళ భోలె ఎలిమినేట్ అయితే అశ్విని ఒంటరి అయిపోతుంది.
అశ్విని చూస్తే పెళ్లి కాని అమ్మాయిలానే కనిపిస్తుంది. కానీ ఆమెకి ఇదివరకే పెళ్లయిందని పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2013లో పెద్దల చూపించిన ఓ అబ్బాయిని పెళ్లి చేసుకుందని, కానీ ఇద్దరి మధ్య విబేధాలు రావడంతో విడిపోయారని అంటున్నారు. అయితే నిజమా? అబద్ధమా? అనేది మాత్రం తెలియట్లేదు. ఏదేమైనా ఒకవేళ పెళ్లయి విడాకులు తీసుకుంటే మాత్రం స్వయంగా ఈమె చెబితే గానీ ఈ విషయమై క్లారిటీ రాదు!
(ఇదీ చదవండి: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న 'విక్రమ్' నటుడు.. అమ్మాయి ఎవరంటే?)
Comments
Please login to add a commentAdd a comment