శోభాశెట్టి ట్రాపులో పడిన రతిక.. ఈమెది దెయ్యం తిండి అట! | Bigg Boss 7 Telugu Day 54 Episode Highlights: Rathika Vs Prashanth, Captaincy Contenders Task And Other Highlights Inside - Sakshi

Bigg Boss 7 Day 54 Highlights: మళ్లీ అదే తప్పు చేస్తున్న రతిక.. శోభాశెట్టికి అడ్డంగా దొరికిపోయి!

Oct 27 2023 11:05 PM | Updated on Oct 28 2023 9:50 AM

Bigg Boss 7 Telugu Day 54 Episode Highlights - Sakshi

బి‍గ్‌బాస్ 7 సీజన్ కొన్నాళ్ల ముందుతో పోలిస్తే ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్ మారింది. గొడవలు, తిట్టుకోవడాలు ఎక్కువయ్యాయి. అదే టైంలో కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ కిందామీదా పడుతున్నారు. తాజాగా కెప్టెన్సీ దక్కించుకునేందుకు ఫైనల్ టాస్క్ ఒకటి పెడ్డగా.. ఇందులో శోభాశెట్టి హైలైట్ అయ్యింది. అదే టైంలో ఈమె వల్ల రతిక బండారం బయటపడింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 54 హైలైట్స్‌లో చూద్దాం.

ప్రశాంత్ vs రతిక అక్క
ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్‌గా ప్రియాంక, గౌతమ్, శోభా, ప్రశాంత్, సందీప్ నిలవడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. ప్రశాంత్-రతిక మధ్య 'అక్క' అనే పదం గురించి డిస్కషన్‌తో శుక్రవారం ఎపిసోడ్ షురూ అయింది. తనని అక్క అని పిలవొద్దని, బయట చాలా ప్రాబ్లమ్ అయిందని రతిక చెప్పుకొచ్చింది. కానీ ప్రశాంత్ అస్సలు వినలేదు. అ‍క్క అనే పిలుస్తానని భీష్మించుకు కూర్చున్నాడు. మధ్యలో కారణం లేకుండా ఓసారి ఏడ్చాడు కూడా. ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దిన పెద్దమనిషి శివాజీ.. రతిక-ప్రశాంత్ మధ్య సంధి కుదిర్చాడు.

(ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్‌బాబు.. త్వరలో శుభకార్యం!)

కొత్త కెప్టెన్ వచ్చాడ్రోయ్
ఇక కెప్టెన్సీ కంటెండర్‌షిప్ రేసులో ఉన్న ఐదుగురిలో ఎవరికి కెప్టెన్ అయ్యేందుకు అనర్హత ఉందో, వాళ్ల మెడలో ఎండుమిర్చి దండ వేయాలని.. 'ఈ మిర్చి చాలా హాట్' అనే టాస్కుని బిగ్‪‌బాస్ పెట్టాడు. చివరగా ఎవరి మెడలో అయితే తక్కువ దండలు ఉంటాయో వాళ్లే కెప్టెన్ అవుతారని అన్నాడు. ఇందులో అస్సలు ఒక్క దండ కూడా పడని గౌతమ్.. బిగ్‌బాస్ హౌసుకి కొత్త కెప్టెన్ అయ్యాడు.

ఎవరు ఎవరికి దండేశారు?

  • అమరదీప్ - ప్రశాంత్
  • తేజ - ప్రశాంత్
  • యవర్ - శోభాశెట్టి
  • భోలె - ప్రియాంక
  • అశ్విని - ప్రియాంక
  • రతిక - శోభాశెట్టి
  • అర్జున్ - సందీప్
  • శివాజీ - సందీప్

(ఇదీ చదవండి: అబద్ధం చెప్పి దొరికిపోయిన శ్రీలీల.. ఆ హీరోకి ఆల్రెడీ ముద్దు!)

శోభా ట్రాప్‌లో ఇద్దరు
అయితే ఈ టాస్కులో భాగంగా తనని అనర్హత పేరు చెప్పి మిర్చి దండ వేయడంపై శోభాశెట్టి తట్టుకోలేకపోయింది. తొలుత యవర్‌తో.. తొలి రెండు పోటీల్లో ఓడిపోయి, మూడే గేమ్‌లో గెలిచావ్ అందుకే ఈ దండ వేస్తున్నా అని కారణం చెప్పాడు. దీంతో శోభా పెద్ద గొడవ పెట్టుకుంది. ఏకంగా పిచ్చోడు అనేసింది. దీంతో అతడు నిజంగానే మెంటలెక్కినట్లు అరిచాడు. మిర్చి దండ విసిరి కొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య హోరాహోరీ సాగింది. ఇది అయిన తర్వాత లివింగ్ రూంలో కూర్చుని శోభా కన్నీళ్లు పెట్టుకుంది. గేమ్‌లో గెలిస్తే ఓ బాధ, గెలవకపోతే ఓ బాధ అని ఏడ్చేసింది.

రతిక మళ్లీ అదే తప్పు
హౌసులో మాటలు మారుస్తూ అందరి ఆట చెడగొడుతుందనే కారణంతో రతిక ఇప్పటికే ఓసారి హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తోంది. శోభాకి మిర్చి దండ వేసిన ఈమె.. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కానీ శోభా ఊరుకోలేదు. దీంతో చాలాసేపు గొడవ జరిగింది. 'నిన్న నువ్వే నాతో అన్నావ్.. లేడీ కెప్టెన్ ఉంటే బాగుంటుందని, ఇప్పుడు నువ్వే దండం వేస్తున్నావ్' అని రతిక నిజస్వరూపాన్ని శోభా బయటపెట్టింది. అలా శోభా కావాలనే రెచ్చగొడితే.. యవర్, రతిక ఇద్దరూ ట్రాపులో పడ్డారు. ఇది జరిగిన తర్వాత రతిక గురించి శోభా-అశ్విని మాట్లాడుకున్నారు. రతిక ఏంటి? దెయ్యంలా అంత తింటుంది! అని అశ్విని బయటపెట్టింది.  రతిక.. తినడం, తిరగడం, మాట్లాడటం తప్ప హౌసులోకి ఏం చేయట్లేదని శోభా అరుస్తూ చెప్పింది. అలా శుక్రవారం ఎపిసోడ్ కాస్త నీరసంగానే ముగిసింది.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement