బిగ్‌బాస్ హౌసులో నామినేషన్స్ సందర్భంగా సోమవారం ఫుల్ రచ్చ కొనసాగింది. మొత్తం గొడవ గొడవ జరిగింది. అలానే నామినేషన్స్ ప్రక్రియ.. మంగళవారం కూడా కొనసాగింది. ఈరోజు కూడా గొడవలు మాములుగా జరగలేదు. అలానే 'పవర్ అస్త్ర' కోసం మరో గేమ్ కూడా ఆడారు. దీంతోపాటే ఎనిమిదో రోజు ఎపిసోడ్ లో ఏమేం జరిగాయనేది Day-8 హైలైట్స్ చూద్దాం.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'కి డబ్బింగ్ చెప్పే ఈయన ఎవరో తెలుసా?)
ప్రశాంత్ ఓవరాక్షన్
పల్లవి ప్రశాంత్ నామినేషన్ మధ్యలో ఉండగానే సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. మంగళవారం అక్కడే నుంచి మొదలైంది. తొలుత తేజ, గౌతమ్, దామిని, అమర్‌దీప్, ప్రియాంక, షకీలా నామినేట్ చేశారు. ఈ క్రమంలోనే ప్రశాంత్ ఓవరాక్షన్ నచ్చ.. శోభాశెట్టి, రతిక, శుభశ్రీ కూడా వచ్చారు. ఒరిజినాలిటీ ఎక్కడా కనిపించట్లేదని శోభాశెట్టి.. ప్రశాంత్‌కి కౌంటర్ వేసింది.
నిజం బయటపెట్టాడు
ఇకపోతే అందరూ తనని నామినేట్ చేసేసరికి ప్రశాంత్.. కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆట ఇప్పుడే మొదలైంది, బయట మా వాళ్లు ఉన్నారు. చూసుకుంటారు అని తన అసలు రంగు బయటపెట్టాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ప్రతిఒక్కరూ ఇంట్లోకి వచ్చేటప్పుడు సెటప్ చేసుకుని వస్తారు కానీ ప్రశాంత్ ఇలా చెప్పడం కాస్త ఓవర్‌గా అనిపించింది.
(ఇదీ చదవండి: చిరంజీవి హిట్ సినిమాల నిర్మాత కన్నుమూత)
మనసు విరిచిన రతిక
ఇక ప్రశాంత్ ని నామినేట్ చేసిన రతిక.. అవకాశం వచ్చేవరకు ఓ ప్రశాంత్, వచ్చిన తర్వాత మరో ప్రశాంత్ కనిపిస్తున్నాడని తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. దీంతో మనోడు సైలెంట్ అయిపోయాడు. బిగ్ బాస్ గెలిస్తే డబ్బులు ఏం తీసుకోకుండా ఉండగలవా అంటే.. అవును అస్సలు తీసుకోను అని ప్రశాంత్ చెప్పాడు. ఇదెక్కడి దిక్కుమాలిన గొడవరా బాబు అనిపించింది. మరోవైపు నామినేషన్‌లో భాగంగా 'లవ్ చేస్తున్నానా అని నీతో చెప్పానా?' అని రతికతో ప్రశాంత్ అనడం ఆమెకు నచ్చలేదు. దీంతో ప్రశాంత్ అసలు రూపం బయటపడిందని ఆమె చెప్పుకొచ్చింది.
శోభాశెట్టి vs శివాజీ
తర్వాత గౌతమ్ బాక్సులోకి రాగా.. ప్రశాంత్ నామినేట్ చేశాడు. అనంతరం శోభాశెట్టిని శివాజీ నామినేట్ చేశాడు. 'ప్రియాంక చెప్పిన రీజన్ నువ్వు కూడా చెప్పావ్, నన్ను నామినేట్ చేశావ్ అందుకే నామినేట్ చేస్తున్నా' అని అన్నాడు. యాక్టివిటీ రూంలో వీళ్లిద్దరూ బాగానే ఉన్నారు గానీ బయటకొచ్చిన తర్వాత శివాజీ, శోభాశెట్టి మాటామాటా అనుకున్నారు. మాట తెరిస్తే కంటెంట్, కంటెంట్ అంటున్నారు మీరు అని శోభాశెట్టి అతడికి కౌంటర్ వేసింది. ఇంప్రెస్ టాస్కులో ఓడిపోయానని బిగ్‌బాస్ నాకు చెప్పలేదు కదా.. నా దగ్గరకు వచ్చి మీరు ఇబ్బంది పెట్టారు కదా అని శివాజీకి శోభాశెట్టి కౌంటర్ వేసింది. రీజన్ లేకపోయినా సరే కావాలని నామినేట్ చేస్తున్నారని మండిపడింది.
(ఇదీ చదవండి: యాంకర్ రష్మీ పరువు తీసిన బుల్లెట్ భాస్కర్!)
తేజతో రతికకి ఇష్యూ
ఇకపోతే షకీలాని ప్రిన్స్ నామినేట్ చేశాడు. శుభశ్రీ, ప్రియాంకని ఎవరూ నామినేట్ చేయలేదు. తర్వాత రతిక రాగా.. ఆమెని గౌతమ్, తేజ నామినేట్ చేశారు. వీఐబీ బెడ్ రూంలో గొడవపడి, అదే బెడ్‌పై పడుకోవడం నచ్చలేదని గౌతమ్ రీజన్ చెప్పాడు. తనని బొండం అని పిలవడం నచ్చలేదని తేజ కారణం చెప్పాడు. మరి తనని చెంపపై కొట్టడం కరెక్ట్ కాదు కదా అని రతిక వాదించింది. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య రచ్చ రచ్చ జరిగింది. మరోవైపు రతికని నామినేట్ చేస్తూ.. ప్రశాంత్‌ని తేజ టీజ్ చేశాడు. దీంతో తాను ప్రేక్షకుడిని, తనని వదిలేయ్ అన్న అని తేజతో ప్రశాంత్ అన్నాడు.
రూల్స్ బ్రేక్ చేసిన శివాజీ
ఇకపోతే అమర్‌దీప్‌ని ప్రిన్స్ నామినేట్ చేశాడు. అయితే హౌసులో ప్రతిఒక్కరూ ఇద్దరిని నామినేట్ చేయాల్సి ఉండగా, శివాజీ ఒక్కరినే చేశాడు. ఈ విషయమై బిగ్‌బాస్ అడగ్గా శివాజీ తొలుత చేయనని అన్నాడు. కానీ రెట్టించి అడిగేసరికి అమర్‌దీప్ నామినేట్ చేశాడు. అయితే ఇక్కడ కావాలనే సింపతీ కొట్టేద్దామనే శివాజీ ఇలా ప్రవర్తిస్తున్నట్లు అనిపించింది.
(ఇదీ చదవండి: కోర్టులో గెలిచిన విశాల్.. చెప్పిన టైమ్‌కే 'మార్క్ ఆంటోని')
ఈ వారం నామినేషన్స్ లిస్ట్
- శివాజీ
- ప్రశాంత్
- రతిక
- తేజ
- అమర్ దీప్
- షకీలా
- గౌతమ్
- శోభా
- ప్రిన్స్
రూమ్ షేరింగ్
వీఐపీ రూంలో సందీప్ మాత్రమే ఉండాలని బిగ్ బాస్ ఆర్డర్ వేశాడు. అలానే డీలక్స్, స్టాండర్డ్ రూమ్స్‌లో ఎవరెవరు ఉండాలనేది డిసైడ్ చేయాల్సిందిగా సందీప్‌ని బిగ్‌బాస్ ఆదేశించాడు. దీంతో డీలక్స్ రూంని షకీలా, శివాజీ, దామిని, శుభశ్రీ, అమర్‌దీప్‌కి కేటాయించారు. స్టాండర్స్ రూంని రతిక, ప్రిన్స్, ప్రశాంత్, గౌతమ్, శోభాశెట్టి, ప్రియాంకకు కేటాయించారు. మిగిలిన తేజని బయట సోఫాలో పడుకోమని చెప్పారు. అయితే శుభశ్రీకి డీలక్స్ రూం ఎందుకిచ్చారని.. శోభాశెట్టి, సందీప్‌తో గొడవ పెట్టుకుంది.
పవర్ అస్త్ర కోసం పోటీ
ఇప్పటికే పవర్ అస్త్ర గెలుచుకున్న సందీప్ ఇంటి సభ్యుడి అయిపోయాడు. మిగతా వాళ్లు అది గెలుచుకోవాలంటే గేమ్ ఆడాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. 'మాయ అస్త్ర' పేరుతో ఓ టాస్క్ పెట్టాడు. 'టగ్ ఆఫ్ వార్' గేమ్ లాంటిది పెట్టగా, డిఫరెంట్ కాస్ట్యూమ్స్ ధరించిన హౌస్‌మేట్స్.. రణధీర సమూహం (అమర్‌దీప్, శివాజీ, ప్రిన్స్, ప్రియాంక, శోభా, షకీలా), మహాబలి(గౌతమ్, ప్రశాంత్, తేజ, రతిక,దామిని, శుభశ్రీ) గ్రూపులుగా ఏర్పడ్డారు. ఇందులో రణధీర టీమ్.. మూడు పాయింట్లు గెలుచుకుని విజయం సాధించింది. దీంతో 'పవర్ అస్త్ర' సంపాదించేందుకు కావాల్సిన తాళాన్ని రణధీర సమూహం దక్కించుకుంది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు)
Comments
Please login to add a commentAdd a comment