శివాజీ మీద పైచేయి సాధించిన అమర్‌ | Bigg Boss 7 Telugu Day 58 Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 58 Highlights: శివాజీ మీద పైచేయి సాధించిన అమర్‌

Nov 1 2023 7:59 AM | Updated on Nov 1 2023 11:40 AM

Bigg Boss 7 Telugu Day 58 Highlights - Sakshi

బిగ్ బాస్ నామినేషన్స్ ఈ వారం చాలా ఫన్నీ రీజన్స్‌తో ముగిసింది. మంగళవారం జరిగిన నామినేషన్లో యావర్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేసి అశ్వినిని నామినేషన్‌లోకి తీసుకొచ్చాడు. నామినేషన్లో పసలేని కారణాలతో  రతికా రోజ్‌, అశ్వినిలు ఉన్నారని చెప్పవచ్చు. కానీ ఈ వారం నామినేషన్‌ ప్రక్రియలో శివాజీ మీద అమర్‌ పైచేయి సాధించాడు. ఆ కథేంటో మంగళవారం జరిగిన ఎపిసోడ్‌లో ఏం జరిగిందో Day 58 హైలెట్స్‌ ఇప్పుడు చూద్దాం.

సోమవారం ఎపిసోడ్‌లో ప్రశాంత్ ,ప్రియాంక,అర్జున్ ,శివాజీ,రతిక, తేజ, భోలె నామినేషన్‌ ప్రక్రియలో పాల్గొని వారికి నచ్చని ఇద్దరి పేర్లు చెబుతూ ఎలిమినేషన్‌ లిస్ట్‌లో చేర్చారు. మంగళవారం ఎపిసోడ్‌లో మొదట శోభ నామినేషన్‌ విదానాన్ని ప్రారంభంచింది. శోభ సరైన కారణాలతో రతికా రోజ్‌ను నామినేట్‌ చేసినా వాటిని తిప్పకొట్టడంలో రతిక విఫలమైంది. లాజికల్‌ పాయింట్లు లేకుండా రతిక మాట్లాడిన మాటలు చిరాకు తెప్పించాయి. ఆడియన్స్‌కు బాగా దొరికి పోతున్నావని  ఒకానొక సమయంలో తేజ కలుగచేసుకుని రతికా రోజ్‌ను హెచ్చరిస్తాడు. అయినా ఆమె వినకుండా మరింత రెచ్చిపోయి పసలేని కారణాలు శోభకు చెప్పి రతిక ప్రేక్షకులకు దొరికిపోయింది. ఆ తర్వాత యావర్‌ను సరైన కారణంతో శోభ  నామినేషన్‌ చేయడంతో ఆయన ఎటువంటి మాటలు మాట్లడకుండా స్వీకరిస్తాడు.


యావర్‌తో అశ్విని ఫైట్‌
యావర్‌ మొదటగా శోభను నామినేషన్లో చేర్చగా వారిద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం జరగలేదు. దానికి ప్రధాన కారణం యావర్‌ చెప్పిన సరైన పాయింట్లకు ఆమె నుంచి ఎలాంటి సమాధానం లేకుండాపోయింది. ఆ తర్వాత అశ్విని పేరును యావర్‌ లేవనెత్తుతాడు. ఆటలో కన్‌ఫ్యూజ్‌ అవుతున్నావని హౌస్‌లో ఉండాలంటే ఆట తీరును ఆర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని ఇవేవి నీలో లేవని అశ్వినికి తెలిపి యావర్‌ నామినేషన్‌ చేస్తాడు. అందుకు ఉదాహరణగా గతంలో అమర్‌ను నామినేట్‌ చేస్తానని చెప్పి ఆ తర్వాత ఫ్లిప్‌ అయి అర్జున్‌ను నామినేషన్‌ చేయడం ఏంటని యావర్‌ ప్రశ్నించాడు.

అలా యావర్‌ చెప్పిన ఐదు పాయింట్లలో నాలుగు సరైనవే అనేలా ఉన్నాయి. కానీ సందీప్‌ మాస్టర్‌కు ఒక టాస్క్‌లో అశ్విని వాటర్‌ పోస్తుంది. దానిని యావర్‌ తప్పుబడుతూ నామినేట్‌ చేస్తాడు. ఇందులో ఏ మాత్రం పసలేదని తెలుస్తోంది. వారిద్దరి మధ్య నామినేషన్‌ ప్రక్రియ చాలా ఫన్నీగా జరుగుతుంది.

శివాజీ మీద పైచేయి
అమర్‌ చేసిన నామినేషన్లలో ఈ వారం శివాజీపై పైచేయి సాధించాడని చెప్పవచ్చు. శివాజీని ఉద్దేశిస్తూ.. అన్నా మీకు నేను ఎందుకు నచ్చనో అలాగే మీరు కూడా నాకు నచ్చరు అని ఓపెన్‌గానే చెబుతాడు అమర్‌. ఆటలో నేను మాత్రమే అరుస్తున్నాని, కేకలు వేస్తున్నానని ప్రతిసారి నన్ను నామినేషన్‌ చేస్తున్నావ్‌.. అలాగే నీ పక్కన ఉన్నవారు కూడా నామినేషన్‌ సమయంలో కేకలు వేస్తున్నారు కదా వారిని ఎందుకు హెచ్చరించరని సరైన పాయింట్‌ను శివాజీకి అమర్‌ వేశాడు.

అప్పుడు శివాజీ కూడా వాళ్లకు వార్నింగ్‌ ఇచ్చాను.. చెబుతున్నాను అంటాడు. అలా చెప్పడం కాదన్నా.. నాకు ఎలా చెప్పారో వాళ్లను కూడా నామినేషన్లో నిలబెట్టి చెప్పండి అని అమర్‌ తెలుపుతాడు. దీంతో ఇబ్బంది పడ్డ శివాజీ ఆన్సర్‌ చెప్పలేక సైడ్‌ అయిపోతాడు. అలాగే సందీప్‌ మాస్టర్‌ను ఇంటి నుంచి పంపించావ్‌ అని తేజను నామినేట్‌ చేస్తాడు శివాజీ.. మరి సందీప్‌ మాస్టర్‌ను ఎలిమినేషన్‌ లిస్ట్‌లో పెట్టిన యావర్‌ను మాత్రం ఒక మాట కూడా అనలేకపోయాడు శివాజీ. ఇలా ఈ వారంలో శివాజీ దొరికిపోయాడు.  

ఈ వారం నామినేషన్లో ఉండేది వీళ్లే

1. అమర్‌ దీప్‌
2. రతికా రోజ్‌
3. శోభ శెట్టి
4. ప్రియాంక జైన్‌
5. అర్జున్‌
6. టేస్టీ తేజ
7. భోలే షావలి
8. ప్రిన్స్‌ యావర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement