దొరికిపోయిన రతిక.. మోకాళ్లపై కూర్చుని దండం పెట్టిన అమర్! | Bigg Boss Telugu 7 - Day 58 Promo: Rathika And Amardeep Vs Bhole - Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Promo: రతికకు బొమ్మ కనిపించింది.. అమర్ దెబ్బకు భోలెకి ఇరిటేషన్!

Published Tue, Oct 31 2023 11:39 AM | Last Updated on Tue, Oct 31 2023 11:54 AM

Bigg Boss 7 Telugu Promo Rathika And Amardeep Vs Bhole - Sakshi

బిగ్‌బాస్ షోలో మిగతా రోజుల సంగతెలా ఉన్న నామినేషన్స్ మాత్రం మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తాయి. కంటెస్టెంట్స్ అందరూ పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తారు. అవతలి వాళ్లని నామినేట్ చేసి, వాళ్ల వ్యతిరేకిస్తే గొడవ పెట్టుకోవడానికైనా అస్సలు వెనుకాడరు. ఇప్పటికే సోమవారం సగం నామినేషన్స్ పూర్తి కాగా, మంగళవారం మిగిలినవి జరిగాయి. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేయగా.. అందులో అమరదీప్ హైలైట్ అయ్యాడు. అలానే రతిక ఓ పాయింట్‌లో దొరికిపోయింది.

(ఇదీ చదవండి: లాజిక్స్ మర్చిపోయిన శివాజీ.. అమర్ అడిగిన దానికి నో ఆన్సర్!)

యవర్ లాజిక్ లేని నామినేషన్స్ చేశాడు. కారణాలు ఏం చెప్పాలో తెలీక శోభాశెట్టి, అశ్వినిని నామినేట్ చేశాడు. మరోవైపు రతిక - శోభాశెట్టి మధ్య వాదన గట్టిగా నడిచినట్లు ప్రోమోలో చూపించారు. శోభాతో మాట్లాడుతూ తేజ పేరు తీసుకొచ్చింది. దీంతో తేజ ముందుకొచ్చి.. 'నా పేరు ఎందుకు మధ్యలో తీసుకొచ్చావ్' అని రతికతో అతడు గొడవ పెట్టుకున్నాడు. 'దొరికిపోయావ్.. దారుణంగా జనాలకి దొరికిపోతున్నావ్' అని తేజ అన్నాడు. మరి రతిక నోరు మూసుకుంది. మరి ఆమె ఏ విషయంలో దొరికిపోయిందనేది మంగళవారం ఎపిసోడ్‌లో క్లారిటీ వచ్చేస్తుంది.

'మీరు నామినేట్ చేసిన విధానం నాకు నచ్చలేదు, అందుకే బాధతో మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా' అని అమర్, భోలెని నామినేట్ చేశాడు. 'ఈ హౌసులో ఇంత మంచి పేరు తెచ్చుకున్న నన్ను..' అని భోలె అంటుండగానే.. 'అయ్యో సూపరన్నా మీరు నిజంగా దేవుడు మీరు' అంటూ వెటకారంగా అనేసరికి భోలె మెంటలెక్కిపోయాడు. 'ఈ బిగ్‌బాస్ హౌసులో ఏం సాధించావ్ నువ్వు? బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నావ్' అని భోలె అన్నాడు. 'ఐ యామ్ హియర్ ఏజ్ ఏ బ్యాడ్ బాయ్, మీకు ఏమన్నా ప్రాబ్లమా?' అని కౌంటర్ ఇచ్చాడు. అలానే 'మారు.. మారు' అని ఒకరికొకరు చెప్పుకొన్నారు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్ షో చరిత్రలో ఫస్ట్‌టైమ్ అలాంటి నిర్ణయం!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement