బిగ్‌బాస్ 7లో శివాజీ ఓ ఆటగాడు. కానీ అనుకోకుండా గాయపడ్డాడు. వయసు రీత్యా కాస్త ఇబ్బంది పడుతున్న హౌసులో ఉన్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ గత కొన్నివారాల నుంచి కంటెస్టెంట్స్ అందరూ ఓ విషయాన్ని అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పుడేమో కంగారులో తనకు తానే నిజం బయటపెట్టాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్‌లో ఏం జరిగిందనేది Day 45 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో డబుల్ మీనింగ్ డైలాగ్స్.. 'జబర్దస్త్'ని మించిపోయిందిగా!)
శివాజీ ఏడుపు
నామినేషన్స్ పూర్తి కావడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం నిద్రలేవడంతో బుధవారం ఎపిసోడ్ మొదలైంది. ఇకపోతే బిగ్‌బాస్‌లోకి ఎవరొచ్చినా సరే గేమ్స్ ఆడాలి, మాటలతో మెప్పించాలి. అవతల వాళ్లని నొప్పించి అయినా సరే విజయం సాధించాలి. తప్పు రైటో పక్కనబెడితే యాక్టివ్‌గా ఉండాలి. కానీ శివాజీ మాటలతో కాలక్షేపం చేస్తున్నాడు. కొన్నిరోజుల ముందు గేమ్ ఆడితే గాయపడ్డాడు. దీంతో హౌసులో ఉండటమైతే ఉన్నాడు గానీ బిగ్‌బాస్ శివాజీని అస్సలు కష్టపెట్టట్లేదు. దీంతో శివాజీకి చిరాకేస్తుంది.
అదే విషయాన్ని పరోక్షంగా చెబుతూ.. 'నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, మీ ఇద్దరి (ప్రశాంత్, యవర్) కోసమే ఉంటున్నాను' అని యవర్‌తో చెబుతూ ఏడ్చేశాడు. గత కొన్నివారాల నుంచి కంటెస్టెంట్స్ ఇదే విషయాన్ని చెప్పారు. శివాజీ అన్న.. మీరు ప్రశాంత్, యవర్‌కి సపోర్ట్ చేస్తున్నారని అంటే.. ఇతడు ఒప్పుకోలేదు. ఇప్పుడేమో ఏడుస్తూ అసలు నిజం బయటపెట్టేశాడు.
(ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి' సినిమా రిలీజ్‌కి ముందే రూ 3.5 కోట్లు నష్టం?)
గులాబీపురం vs జిలేబీపురం
నామినేషన్స్ అయిపోయింది. ఇక కొత్త కెప్టెన్ కోసం టాస్క్ పెట్టాలి. ఇందులో భాగంగా ఓ స్పేస్ షిప్ కూలిపోయింది. అందులో గ్రహాంతర వాసుల్ని ఎవరైతే ఎంటర్‌టైన్ చేస్తారో వాళ్లకు పాయింట్స్ దక్కుతాయి. ఇందుకోసం హౌసులో ఉన్నవాళ్లు.. గులాబీపురం, జిలేబీపురం అనే ఊరిలో వ్యక్తులుగా గెటప్స్ వేసి కాసేపు అలరించారు. కానీ ఇదేమంత ఇంట్రెస్టింగ్‌గా అనిపించలేదు. బిగ్‌బాస్‌కి కూడా ఇదే అర్థమైపోయినట్లుంది. ఎక్కువసేపు లాగకుండా త్వరగా ముగించాడు.
గుడ్లు పగిలాయ్
ఎంటర్‌టైన్‌మెంట్ టాస్క్ తర్వాత ఎగ్స్ టాస్క్ పెట్టారు. రిలే రేసులో ఉన్నట్లు నలుగురు ఉంటారు. ఒక చోట నుంచి మరోచోటుకి గుడ్డు ఓ బల్లపై తీసుకెళ్లాలి. ఎవరు ఎక్కువ తీసుకెళ్తే వాళ్లే విజయం సాధించినట్లు. ఈ గేమ్‌లో జిలేబీపురం టీమ్ విజయం సాధించింది. అలా బుధవారం ఎపిసోడ్ పెద్దగా మెరుపుల్లేకుండా ముగిసింది.
(ఇదీ చదవండి: స్టార్ హీరో 25వ సినిమా.. 25 వేల మందికి అన్నదానం)
Comments
Please login to add a commentAdd a comment