బుల్లితెర బిగ్ రియాల్టీ షో బిగ్‌బాస్ ఏడో సీజన్ విజయవంతంగా రన్ అవుతోంది. ఉల్టా పుల్టా అంటూ వచ్చిన ఈ సీజన్.. గత సీజన్ కంటే కాస్త బెటర్‌గానే ఉంది. ఇక ఆరో సీజన్‌లో అట్టర్ ఫ్లాప్ హోస్ట్‌గా పేరు తెచ్చుకున్న నాగార్జున..ఏడో సీజన్‌లో ఇప్పటి వరకు మాత్రం మంచి మార్కులే సంపాదించుకున్నాడు. సీజన్ 7లో ఇప్పటివరకు నాగార్జున ట్రోల్ అయిన సందర్భాలు చాలా తక్కువనే చెప్పాలి.
ఇదిలా ఉంటే.. గత సీజన్ల కంటే స్టైలీష్‌గా హోస్టింగ్ చేస్తున్నాడు నాగార్జున. తన లుక్.. డ్రెస్సింగ్ స్టైల్ వారం వారం డిఫరెంట్‌గా ఉంటుంది. రంగు రంగుల షర్ట్ వేస్తూ..తెరపై మరింత అందంగా కనిపిస్తున్నాడు.
(చదవండి: శివాజీ తెలివిలేని పని.. ప్రియాంక ప్రాణం మీదకొచ్చింది!)
ప్రతివారం నాగార్జున వేసే షర్ట్‌పై నెట్టింట చర్చ జరుగుతోంది. గత శనివారం కూడా నాగార్జున ఓ రంగుల చొక్కాని ధరించి హోస్టింగ్ చేశాడు. ఆ షర్ట్ ధర లక్షల్లో ఉంది. అయితే ఆ షర్ట్‌తో పాటు ఆరోజు నాగార్జున చేతికి ధరించిన ఓ బ్యాండ్‌పై ఇప్పుడు నెట్టింట చర్చ మొదలైంది. చూడడానికి అది స్మార్ట్ వాచ్‌లా కనిపించినా.. దాని వెనక మాత్రం చాలా కథే ఉంది.
అదొక ఫిట్‌నెస్ ట్రాకర్. దాని ద్వారా మన శరీర భాగాల పనితీరును తెలుసుకోవచ్చు. మన బాడీలోని ఒత్తిడి, బీపీ, హార్ట్‌బీట్, పల్స్ రేట్‌ను అది ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంది. అయితే దీని కోసం మన మొబైల్‌లో యాప్‌ని ఇన్‌స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ బ్యాండ్‌ని చేతికి ధరించి.. శరీర భాగాల పనితీరుని మొబైల్‌లో చూసుకోవచ్చు. అయితే ఇది స్మార్ట్ వాచ్‌లా ఒక్కసారి కొంటే..ఎప్పటికీ పనిచేసే పరికరం కాదు. ఫిట్‌నెస్‌ని తెలుసుకోవడం కోసం ప్రతి నెల రీచార్జ్ చేసుకోవాలి. ఇలాంటి ఫిట్‌నెస్ ట్రాకర్‌ని ధరించాలంటే ఏడాదికి రూ. 25 వేలకు పైగా వరకు చెల్లించాల్సి ఉంటుంది. అలా కాకుండా నెల నెల కూడా రీచార్జ్ చేసుకోవచ్చు. ఈ తరహా బ్యాండ్‌లను సినీ సెలబ్రిటీలతో పాటు క్రీడాకారులు కూడా ఎక్కువగా ధరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment