నా కుటుంబమే నరకంలోకి తోసింది: షకీలా | Actress Shakeela Made Shocking Revelations About Movies Career And Her Childhood Life- Sakshi
Sakshi News home page

నా కుటుంబమే నరకంలోకి తోసింది.. అమ్మే ఇలా చేస్తే అంటూ..: షకీలా

Nov 2 2023 10:58 AM | Updated on Nov 3 2023 6:41 PM

Shakeela Comments Her Movie Career - Sakshi

దక్షిణ భారత ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నటి షకీలా. ఒకప్పుడు మలయాళ సినిమా పరిశ్రమలో షకీలా అంటే పెద్ద సంచలనమే. సినిమా టైటిల్స్‌లో ఆమె పేరు ఉంటే చాలు బాక్సాఫీస్‌ బద్దలు కావాల్సిందే..  ఆమె సినిమా రిలీజ్‌ అవుతుందంటే చాలు ఎంత పెద్ద స్టార్‌ హీరో అయినా సరే తన సినిమాను వాయిదా వేసుకోవాల్సిందే.. అలా ఆమె సినిమాల దాటికి భారీ చిత్రాలే కొట్టుకుపోయాయి.   తమిళనాడుకు చెందిన షకీలా సౌత్‌ చిత్రసీమను తన గ్లామర్‌తో ఊపేసింది.

ఒకప్పుడు షకీలా నటించిన చాలా సినిమాలు అశ్లీలతతో కూడుకొని ఉండేవి.  అయితే చాలా ఏళ్ల నుంచి అలాంటి చిత్రాలకు ఆమె దూరంగా ఉంది. షకీలా ఇప్పుడు తమిళం, తెలుగు చిత్రాలతో పాటు పలు రియాల్టీ షోలలో మెప్పిస్తుంది. పలు టెలివిజన్ కార్యక్రమాల ద్వారా హాస్య పాత్రలు చేస్తూ.. కుటుంబ ప్రేక్షకులకు ఇష్టమైన నటిగా మారింది. అంతేకాకుండా తనకు వచ్చే సంపాదనలో కొంతమేరకు సామాజిక సేవా రంగంలో కూడా ఆమె ఖర్చుచేస్తుంది. కుటుంబ పోషణ కోసం షకీలా చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని షకీలా పలు సందర్భాల్లో బహిరంగంగానే చెప్పింది.

తన సినిమా కెరియర్‌తో పాటు జీవితంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను తాజాగా షకీలా షేర్‌ చేసుకుంది. అవి ఇప్పుడు మళ్లీ వైరల్‌ అవుతున్నాయి. సినిమా ప్రపంచం ఆమె ప్రతిభను సరిగ్గా వినియోగించుకోలేదని. కేవలం తన బాడీ బ్యూటీని చూపించి డబ్బు సంపాదించేందుకే ఉపయోగించుకున్నట్లు ఆమె మరోసారి గుర్తుచేసింది. డబ్బు కోసం తన శరీరాన్ని మొదట ఉపయోగించింది తన సొంత తల్తే అని షకీలా వెల్లడించింది. గతంలో ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో షకీలా ఇదే విషయాన్ని చెప్పింది.

ఆమ్మ వల్లే మగవాళ్లతో పరిచయం
షకీలా మాట్లాడుతూ.. 'చిన్న వయసులోనే నేను బలంగా కనిపించేదానిని. వయసుకు మించి నా హైట్‌ ఉండేది. నేను హైస్కూల్‌లో చదువుతున్నప్పుడే కాలేజీ అమ్మాయిలా ఉండేదాన్ని. దారిలో చాలా మంది నన్ను తదేకంగా చూసేవారు. కానీ ఎందుకో నాకు అర్థం కాలేదు. మా ఇంట్లో డబ్బు పెద్ద సమస్యగా ఉండేది. మా అమ్మ మగవాళ్లను పరిచయం చేసి వాళ్ల గదికి వెళ్లమని చెప్పేది. అందుకు నేను ఒప్పుకునేదానిని కాదు.. కానీ ఆ సమయంలో ఆమ్మ కొట్టేది. నాకు వేరే మార్గం లేక నోరు మూసుకుని అమ్మ చెప్పినట్లు ఉండేదానిని.' అని షకీలా అన్నారు.

ఈ ఇంటర్వ్యూలో, షకీలా మాట్లాడుతూ, సినిమా పరిశ్రమలోకి రాకముందు కూడా, డబ్బు కోసం తన కుటుంబం తనను పురుషుల గదికి పంపేదని చెప్పింది. ఏం చేయాలో తెలియక షకీలా అందుకు సిద్ధపడిందని ఆ మాటలను బట్టి అర్థమవుతోంది. 'మా అమ్మమ్మ, అమ్మ కూడా ఈ విధంగా చాలా డబ్బు సంపాదించారు. నన్ను అదే దారిలో వెళ్లమన్నారు. కానీ నేను సినిమాలు ఎంపిక చేసుకున్నాను. కానీ ఇక్కడ కూడా నా శరీరం కేవలం ప్రదర్శనకు మాత్రమే ఉంచేవారు. అందుకు నాకు చాలా బాధగా ఉండేది. ఆర్టిస్ట్‌గా ఉండే అర్హతలు నాకు ఉన్నాయి కానీ ఇండస్ట్రీలో నన్ను ఎవరూ కోరుకోలేదు. కెమెరా ముందు నన్ను కీలుబొమ్మలా వాడుకున్నారు' అని షకీలా అన్నారు.

తన జీవితంలో తన సోదరినే చాలా ఎక్కువగా మోసం చేసిందని ఆమె చెప్పింది. షకీలా కూడబెట్టిన మొత్తం డబ్బును తన సోదరి తీసుకుని మోసం చేసినట్లు ఇది వరకే చెప్పింది. ఇటీవల షకీలా తెలుగు బిగ్‌బాస్ సీజన్‌ 7లో కనిపించింది. కానీ రెండో వారంలోనే ఆమె ఎలిమినేట్‌ అయింది. అమె మరికొన్ని రోజులు ఉండుంటే ఆమెకు మరికొంత డబ్బు వచ్చేది. ఆ డబ్బును పలు సామాజిక సేవలకు ఉపయోగించేదని ఆమె అభిమానులు చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement