బిగ్‌బాస్ హౌసులోకి కొత్తగా ఐదుగురు కంటెస్టెంట్స్ వచ్చారు. ఇప్పటికే ఉన్న ఎనిమిది మందికి గట్టి పోటీ ఇచ్చారు. ఏకంగా రెండు గేమ్స్‌లో గెలిచేశారు. ఇది కాదన్నట్లు గత 36 గంటలుగా సీక్రెట్ రూంలో ఉన్న గౌతమ్.. హౌసులోకి రీఎంట్రీ ఇచ్చాడు. మరోవైపు అమరదీప్‌కి ఎలిమినేషన్ భయం పట్టుకుంది. ఇంతకీ మంగళవారం ఏం జరిగిందనేది Day 37 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం.
(ఇదీ చదవండి: రాజకీయాల్లోకి అనసూయ? హాట్ యాంకర్ సమాధానమిదే!)
గౌతమ్ ఈజ్ బ్యాక్
నామినేషన్స్ పూర్తి కావడంతో సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. మళ్లీ అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. ఇది జరగడానికి కాసేపటి ముందు సీక్రెట్ రూంలో ఉన్న గౌతమ్.. హౌసులోకి రీఎంట్రీ ఇచ్చాడు. వస్తూనే 'అశ్వద్ధామ ఈజ్ బ్యాక్' అని కాస్త హడావుడి చేశాడు. మనోడిని సీక్రెట్ రూంలో పెట్టడమే కాస్త అతిగా అనిపిస్తే.. బయటకొచ్చాక చేసిన హంగామా నవ్వుకునేలా చేసింది. ఇకపోతే గౌతమ్.. ఆటగాళ్లలో కాకుండా పోటుగాళ్లలో(కొత్తగా వచ్చినోళ్లు) ఒకడిగా ఉంటాడని బిగ్‌బాస్ చెప్పాడు.
నామినేషన్స్‌లో ఏడుగురు
ఇకపోతే ఈ వారం.. అమరదీప్, యవర్, సందీప్, తేజ, శోభాశెట్టి, నయని, అశ్విని, పూజా నామినేట్ అయ్యారు. అయితే వీళ్లలో ఒకరిని సేవ్ చేయొచ్చు, లేదంటే నేరుగా నామినేట్ చేసే అవకాశాన్ని గౌతమ్‌కి బిగ్‌బాస్ ఇచ్చాడు. దీంతో అతడు సందీప్ ని సేవ్ చేస్తున్నట్లు చెప్పాడు. ఈ క్రమంలోనే శివాజీతో మాట్లాడిన గౌతమ్.. ఎంటర్‌టైన్ చేయట్లేదని చెప్పి బయటకు పంపేశారు, ఎంటర్‌టైన్‌మెంట్ అంటే ప్యాంట్ తీసి తిరగడం కాదు కదా అని శివాజీకి కౌంటర్ వేశాడు. దీని గురించి ఇద్దరి మధ్య కాసేపు వాదన నడిచింది.
(ఇదీ చదవండి: కొడుకు లిప్‌లాక్ సీన్స్.. రాజీవ్ కనకాల అలాంటి కామెంట్స్!)
ఆటగాళ్లు vs పోటుగాళ్లు
ఐదువారాల నుంచి ఉన్నవాళ్లందరూ ఆటగాళ్లు.. కొత్తగా వచ్చిన వాళ్లందరూ పోటుగాళ్లు గ్రూపులుగా.. 'హూ ఈజ్ ద బెస్ట్' టాస్కులో తలపడతారని అన్నాడు. ఇందులో పలు గేమ్స్ ఉంటారని క్లారిటీ ఇచ్చాడు. వీటిలో గెలిచి ఎవరైతే ఇతరుల కంటె బెస్ట్ అని నిరూపించుకుంటారో వాళ్లు కెప్టెన్సీ కంటెండర్స్ అవుతారని బిగ్‌బాస్ చెప్పాడు. తొలుత 'హూ ఈజ్ ఫిట్టెస్ట్' గేమ్ పెట్టగా అందులో పోటుగాళ్లు టీమ్ నుంచి అర్జున్-గౌతమ్ జోడీగా పాల్గొని గెలిచారు. 'హూ ఈజ్ జీనియస్' అనే రెండో గేమ్‌లోనూ పోటుగాళ్లే విజయం సాధించారు.
అమర్ భయం భయం
'హౌ ఈజ్ జీనియస్' గేమ్‌లో తొలుత ఆడతానని వెళ్లిన అమరదీప్.. సరైన సమాధానాలు చెప్పలేక మధ్యలోనే వచ్చేశాడు. అతడి బదులు తేజ.. గేమ్ పూర్తి చేశాడు. ఇందులో ఆటగాళ్ల గెలవలేదు. దీంతో ఈ గేమ్ పూర్తయిన తర్వాత అమరదీప్ పూర్తిగా డిసప్పాయింట్ అయ్యాడు. ఈ వారం బయటకు తోసేస్తారేమో అనిపిస్తుందని శివాజీతో మాట్లాడుతూ అమర్ భయపడ్డాడు. ఇది జరగడానికి కాసేపటి ముందు కొత్తగా వచ్చిన పూజమూర్తి, అమర్ దగ్గరకొచ్చి.. 'బయట చూసిన అమరదీప్ వేరు.. ఇక్కడ చూస్తున్న అమరదీప్ వేరు' అని అతడితో చెప్పింది. ఈ ఎపిసోడ్‌లో అయితే అమరదీప్ ముఖంలో ఎలిమినేషన్ భయం స్పష్టంగా కనిపించింది. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది.
(ఇదీ చదవండి: రాజమౌళి బర్త్‌డే స్పెషల్.. ఈ డైరెక్టర్ ఆస్తి ఎంతో తెలుసా?)
Comments
Please login to add a commentAdd a comment