ప్రతీకాత్మక చిత్రం
Cyberbullying Prevention Tips: కొట్టి చంపడానికి కర్రలు, రాళ్లు అక్కర్లేదు. కొన్ని పదాలు కూడా చంపగలవు. ఈ రోజుల్లో సోషల్ మీడియా అంతటా ఉంటోంది. కుటుంబాలు, స్నేహితులు, ప్రకటన దారులు, ప్రముఖులు, సంస్థలు.. దాదాపు ప్రతి ఒక్కరూ దీనిని ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఉపయోగిస్తున్నారు.
ఓ ప్రఖ్యాత ఇంటర్నెట్ సర్వే సంస్థ ప్రకారం మన ప్రస్తుత ప్రపంచ జనాభా 7.75 బిలియన్లు ఉంటే ఇంటర్నెట్‌లో 4.54 బిలియన్లు, మొబైల్‌లో 5.19 బిలియన్లు, సోషల్ మీడియాలో 3.8 బిలియన్ వినియోగదారులు ఉన్నారు.
సగటున కనీసం 25% మంది వినియోగదారులు తమ వినియోగ సమయంలో నిస్సందేహంగా ఏదో ఒకరకమైన సోషల్ మీడియా ట్రోల్‌కు లోనవుతున్నారు. ఇంటర్నెట్‌లోని దాదాపు ప్రతిమూలలో కనిపించే రుగ్మత ఏకైక ఉద్దేశం వివాదాస్పద ప్రకటనలు చేయడం ద్వారా ట్రోల్ లేదా సోషల్ మీడియా సైట్‌లలో సంఘర్షణను, సమస్యలను సృష్టిస్తున్నాయి. ఇది ఒక వ్యక్తి సామాజిక శ్రేయస్సు, భావోద్వేగ శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది.
ఆన్‌లైన్ ట్రోలింగ్ దుర్వినియోగం వల్ల మానసిక, శారీరక ఒత్తిడి ఏర్పడుతుంది. వ్యక్తిగత గుర్తింపు, విశ్వసనీయత, ఆర్థిక, ఇతర పరిణామాలకు దారితీయవచ్చు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చర్యలతో సాంకేతిక దుర్వినియోగం జరుగుతోంది. అవమానించే చర్యలకు పాల్పడటం, అభ్యంతరకరమైన సందేశాలు పంపడం, వ్యక్తిత్వాన్ని కించపరచడం, విభేదాలను, వివాదాలను సృష్టించే ఉద్దేశంతోనే ఒక వ్యక్తి ట్రోల్‌కి పాల్పడతాడు.
ట్రోల్‌కి అడ్డా...
ట్రోల్ చేసేవారు నకిలీ ఆన్‌లైన్ అకౌంట్లను సృష్టిస్తారు. ఇలాంటివారు బ్లాగింగ్ సైట్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఇంటర్నెట్ చాట్‌రూమ్‌లు, ఇమెయిల్స్/వాట్సప్ గ్రూప్స్, చర్చావేదికలు, బ్లాగులు.. లేదా ఏదైనా ఇతర ఆన్‌లైన్ ఫార్మాట్‌లలోనో పొంచి ఉంటారు.
గుర్తించే విధం...
ట్రోల్ చేసిన వారి బయోడేటా, పేరు, ఫొటో అస్పష్టంగా ఉంటాయి. ఫేక్ ఐడీలను సృష్టిస్తారు. వారు ఎక్కడ నుండి వచ్చారు, పని ఏంటి.. అనే విషయాలన్నీ అస్పష్టంగానే ఉంటాయి. వీరికి తక్కువమంది ఫాలోవర్లు ఉంటారు. వీరి పోస్ట్‌లు చాలా వరకు ఇతరులతో సంభాషణ, డైలాగ్‌లు పంచుకున్నట్టు ఏమాత్రం కనిపించవు. చాలా తక్కువమంది వ్యక్తుల పోస్ట్‌ల రీ ట్వీట్ చేయడం వంటివి గమనింవచ్చు.
కోపంగా లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలను పోస్ట్ చేస్తారు. ∙అనేక సంస్థలు లేదా ప్రస్తుత సమస్యతో సంబంధం లేని వ్యక్తులను ట్యాగ్ చేస్తారు. అభ్యంతరకరమైన, దూషించే భాషను ఉపయోగిస్తారు. ∙తరచూ వ్యాఖ్యల వరదను పోస్ట్ చేసి, ఆపై టాపిక్‌ని మారుస్తారు. మీ పనికి సంబంధించిన సమస్యలపై చాలా అరుదుగా పోస్ట్ చేస్తారు.
పెస్ట్ కంట్రోల్...
పంటను కాపాడుకోవడానికి పురుగు మందులను ఎలా ఉపయోగిస్తామో, అలాగే సామాజికంగా ఉండాలనుకునేవారు ప్రతికూల వ్యాఖ్యలను నివారించడానికి సిద్ధంగా ఉండాలి. మీ వ్యూవర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే ప్రతికూల వ్యాఖ్యలను జాగ్రత్తగా నిర్వహించినప్పుడే వాటికి విలువ పెరుగుతుంది. విస్మరిస్తే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏదో తప్పు జరిగేవరకు వేచి చూడకూడదు.
సంస్థాగత దృక్కోణమూ అవసరమే..
►ఆన్‌లైన్‌లో మీ కమ్యూనిటీ హౌస్ రూల్స్ ఏంటో తెలుసుకోండి. ∙సరైన టూల్స్‌ని ఎంపిక చేసుకోవాలి.
►మీ కాంటాక్ట్స్ జాబితాలో అత్యవసరంలో స్పందించేది ఎవరో గుర్తించండి.
►మీరు నిర్వహిస్తున్న ఛానెల్ చట్టపరమైన, నియంత్రణ, నైతిక అవసరాలనే గుర్తించండి.
►గత అనుభవాలను ఆధారంగా తీసుకొని జాగ్రత్త పడటం మంచిది.
వ్యక్తిగత దృక్కోణం...
►ఎలాంటి వ్యాఖ్యలు అనుమతిస్తారో, ఎలాంటివి అనుమతించరో ముందే ఒక విధానాన్ని రూపొందించుకోవచ్చు. ∙మీ సామాజిక ప్రొఫైల్‌ను తనిఖీ చేసినట్టుగా ఉంటే, ట్రోలర్ గుర్తింపును సులువుగా తెలుసుకోవచ్చు.
►మీ వెబ్‌సైట్/సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయితే మీరు ‘చెడు’ అనే వ్యాఖ్యలను తొలగించవచ్చు లేదా సభ్యుల జాబితా నుంచి తొలగించవచ్చు.
►మీ సైట్‌లో కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మోడరేట్‌ని ఉపయోగించండి.
►మీకు భారీ ఫాలోవర్ జాబితా ఉంటే ఆన్‌లైన్ టూల్‌ని కొనుగోలు చేయండి.
►మీ చుట్టూ ఒక అనుచరులను సంఘాన్ని సృష్టించవచ్చు. వీరిలో నిష్ణాతులను ఎంపిక చేసుకోవచ్చు.
►కామెంట్ /వ్యాఖ్యకు వెంటనే రిప్లై ఇవ్వడం మంచిది. దీనివల్ల రాబోయే వివాదానికి ముందే అడ్డుకట్టపడుతుంది.
►మీవల్ల తప్పు జరిగిందని భావిస్తే వెంటనే ‘క్షమించండి’ అని చెప్పండి. దీనివల్ల చాలాసార్లు ట్రోల్‌కు అడ్డుకట్ట పడుతుంది. అదే సమయంలో మిమ్మల్ని ప్రశంసిస్తారు కూడా.
‘ట్రోల్’... రిపోర్ట్...
ఎ) మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌నే ఒక రిపోర్ట్‌గా తీసుకోవచ్చు
బి) సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చు.
సి) ఆన్‌లైన్‌లో https://www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయవచ్చు.
డి) డిజిటల్ వెల్‌బీయింగ్, ఇంటర్నెట్ ఎథిక్స్ సపోర్ట్ గ్రూప్‌లు ఐ ఉఅ, ఇఈఅఇ విభాగం, ఎండ్ నౌ ఫౌండేషన్, సైబర్ గర్ల్, సైబర్ జాగృతి, CyberPsy, పోలీస్ మహిళా భద్రతా విభాగం, మహిళలు, పిల్లలు, యుక్తవయస్కులు, ఆన్‌లైన్ వేధింపులను ఎదుర్కోవడానికి వాలంటీర్ల నిర్వహణలో ఉన్న అనేక ఇతర సంస్థల సిబ్బందికి తెలియజేయవచ్చు.
ట్రోల్‌కి ప్రధాన కారణం మానసిక సమస్యలే!
మూడేళ్లుగా ట్రోలింగ్ చేసేవారి ప్రవర్తనను అధ్యయం చేశాం. మానసిక సమస్యల కారణంగానే ట్రోలర్స్ ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం అని తెలుసుకున్నాం. ఈ విషయంపై మనస్తత్వవేత్తలు, డిజిటల్ వెల్‌బీయింగ్ నిపుణులతో చర్చించి నిర్ణయానికి వచ్చాం.
ట్రోల్ చేసేవారిలో.. తీవ్రమైన సామాజిక, మానసిక సమస్యలను గుర్తించాం. లైంగిక సమస్యలు ఎదుర్కొనేవారు ముఖ్యంగా.. బాల్యంలో వేధింపులకు లోనైనవారు, మానసిక ఆరోగ్యసమస్యలు ఉన్నవారు, జంతుప్రవృత్తి గలవారిలో, రాజకీయ లేదా వ్యక్తిగత ద్వేషం ఉన్నవారు ట్రోల్‌కి పాల్పడుతుంటారు.
వీరిలో దాదాపు 60 శాతం మంది పిల్లలపై లైంగిక చర్యలకు పాల్పడినవారు ఉన్నారని తెలిసింది. ట్రోలింగ్, సైబర్ స్టాకింగ్, సైబర్‌బుల్లీ... వీటన్నింటి మధ్య ‘వేధింపు’ అనే ఒక కత్తి ఉందన్నది వాస్తవం. సైబర్ బెదిరింపు, ట్రోలింగ్ సమస్య అంతం కానప్పటికీ చట్టం అమలు, ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి పని చేసే స్వచ్ఛంద సమూహాల విస్తరణ ప్రజలకు పోరాడటానికి, గెలవడానికి అవకాశం కల్పిస్తోంది.
-అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్‌బీయింగ్ ఎక్స్‌పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్.
చదవండి👉🏾 నిశ్చితార్ధం ఫిక్స్ అయింది కదా అని, వ్యక్తిగత వీడియోలు షేర్ చేసినందుకు..
Comments
Please login to add a commentAdd a comment