Cyberbullying
-
బుల్లీయింగ్... సైబర్ బుల్లీయింగ్...
బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ ప్రపంచవ్యాప్తంగా యువతను ప్రభావితం చేసే సమస్యలుగా మారాయి. సాధారణంగా బుల్లీయింగ్ అంటే భౌతిక హింస, మాటలతో అవమానించడం, సామాజికంగా బహిష్కరించడం, పుకార్లు. డిజిటల్ టెక్నాలజీ వల్ల సైబర్ బుల్లీయింగ్ వచ్చేసింది. ఇది సోషల్ మీడియా, టెక్స్టింగ్ లేదా ఇతర డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా జరిగే బుల్లీయింగ్. తామెవ్వరో తెలీకుండా కామెంట్ చేసే అవకాశం ఉండటంతో దీనికి హద్దే లేకుండా పోతోంది. కాదేదీ అనర్హం..బుల్లీయింగ్ చిన్న సమస్య కాదు. దీనివల్ల చాలామంది విద్యార్థులు, ముఖ్యంగా యువత నిరంతర మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. బుల్లీయింగ్ చేసేవారికి ప్రత్యేక కారణమేదీ అవసరం లేదు. తమ ఆధిక్యతను ప్రదర్శించడం కోసం బాధితుల్లో ఏదో ఒక అంశాన్ని తీసుకుని బుల్లీయింగ్ చేస్తుంటారు. అది వారి రూపం నుంచి అకడమిక్ పర్ఫార్మెన్స్ వరకూ ఏదైనా కావచ్చు. దీంతో బాధితులకు ‘నాకు మద్దతుగా ఎవ్వరూ లేరు, నాకిది భద్రమైన ప్రదేశం కాదు’ అనిపిస్తుంటుంది. ఈ రోజుల్లో సోషల్ మీడియా వాడని టీనేజర్ లేడనే చెప్పవచ్చు. దీంతో సైబర్ బుల్లీయింగ్ వ్యక్తిగత జీవితానికీ విస్తరించింది. టీనేజ్లోనే ఎందుకు ఎక్కువ?టీనేజర్లు తమ వ్యక్తిత్వం, ఆత్మగౌరవం, సామాజిక సంబంధాలు వంటి అంశాలను అన్వేషించే సమయంలో వారు మరింత సున్నితంగా ఉంటారు. స్నేహితుల నుంచి అనుకూలత పొందడం కోసం ప్రయత్నిస్తుంటారు. దీన్ని బుల్లీయర్లు దుర్వినియోగం చేస్తుంటారు. నివారణ వ్యూహాలుబుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ ప్రభావాలను అర్థం చేసుకోవడం మొదటి దశ మాత్రమే. ఈ సమస్యలను పరిష్కరించడానికి పాఠశాలలు, తల్లిదండ్రులు, కమ్యూనిటీల భాగస్వామ్యంతో సమర్థవంతమైన వ్యూహాలు అవసరం. కొన్ని ముఖ్యమైన వ్యూహాలు:1. బుల్లీయింగ్, సైబర్ బుల్లీయింగ్ హానికరమైన ప్రభావాల గురించి విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తెలుసుకోవడం చాలా అవసరం. అవగాహన కార్యక్రమాలు యువతను బుల్లీయింగ్ ప్రవర్తనలను గుర్తించేందుకు ప్రోత్సహిస్తాయి.2. పాస్‌వర్డ్స్‌ని పంచుకోవద్దని స్పష్టంగా చెప్పండి. మానసికంగా ప్రేరేపించేదాన్ని గుర్తించి నిరోధించండి.3. మీ టీన్‌తో ఓపెన్‌గా మాట్లాడండి. వారి అనుభవాలను తెలుసుకుని, వారికి సురక్షితమైన వాతావరణం కల్పించండి.4. వారి ఆత్మగౌరవాన్ని పెంచేందుకు అవసరమైన ధైర్యాన్నివ్వండి. వారి మంచి లక్షణాలను గుర్తించి అభినందించండి.5. బుల్లీయింగ్ గురించి మీతో చెప్పుకునే స్వేచ్ఛనివ్వండి. వాళ్లను జడ్జ్ చేయకుండా సమస్యను అర్థం చేసుకోండి. 6. సానుకూలమైన స్నేహాలు ఒక రక్షణ కవచంలా ఉంటాయి. వారి స్నేహాలను ఆరోగ్యకరమైన దిశలో ప్రోత్సహించండి.7. పాఠశాల లేదా కళాశాలలో బుల్లీయింగ్ చోటు చేసుకుంటే.. ఉపాధ్యాయులు, కౌన్సిలర్లతో కలిసి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. బుల్లీయింగ్ వ్యతిరేక విధానాలు స్పష్టంగా అమలయ్యేలా చూడండి. 8. బుల్లీయింగ్ని చూస్తూ ఉండకుండా, వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రోత్సహించండి. 9. తీవ్రత నుంచి బయటపడటానికి బ్రీదింగ్, మెడిటేషన్, జర్నలింగ్ వంటి సాధనాలు నేర్పండి.10. పిల్లలు తల్లిదండ్రులను గమనిస్తూ వారిని అనుకరిస్తుంటారు. అందుకే మీరు ప్రతి సమస్యను శాంతంగా పరిష్కరించి చూపడానికి ప్రయత్నించాలి. 11. సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే ప్రొఫెషనల్ సైకాలజిస్ట్ సాయం తీసుకోవడం మంచిది.తీవ్ర ప్రభావం..బుల్లీయింగ్ అనుభవించిన పిల్లల్లో దీర్ఘకాలంలో వారి మానసిక, భావోద్వేగ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపవచ్చు. అది ఈ విధంగా ఉంటుంది:1. ఎక్కువగా అవమానాలు, ఛీత్కారాలు పిల్లల్లో ఆత్మగౌరవాన్ని తగ్గిస్తాయి. 2. బుల్లీయింగ్ వల్ల కలిగే ఒత్తిడి కలతకు, డిప్రెషన్‌కు దారితీస్తుంది.3. బుల్లీయింగ్ బాధితులు ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. పదిమంది ఉండే పరిసరాల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. 4. బుల్లీయింగ్ వల్ల ఇతరులపై నమ్మకం పోతుంది. అది వారి స్నేహాలకు ప్రతిబంధకంగా మారుతుంది.5. అకడమిక్ పర్ఫార్మెన్స్ కూడా ప్రభావితం అవుతుంది. తరచుగా పాఠశాలకు వెళ్లడం మానేస్తారు, తద్వారా చదువులో వెనకబడతారు. 6. బుల్లీయింగ్ తీవ్రమైన సందర్భాల్లో పిల్లలు ఆత్మహత్య గురించి ఆలోచించే అవకాశాలు కూడా ఉంటాయి. -
సొంత కూతురిపైనే సైబర్ వేధింపులు! ఆఖరికి కూతురి క్లాస్‌మేట్‌ను...
సొంత కూతురిపైనే సైబర్ వేధింపులకు ఒడిగట్టింది ఒక మహిళ. ఆఖరికి ఆమె బాయ్‌ఫ్రెండ్, క్లాస్మేట్లను సైతం వేధింపులకు గురి చేసినట్లు విచారణలో తేలడంతో ఆమె జైలు పాలయ్యింది. ఈ ఘటన యూఎస్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే...42 ఏళ్ల కెన్రా గెయిల్ లికారీ అనే మహిళ తన సొంత కూతరిని, ఆమె బాయ్ప్రెండ్ని, క్లాస్మేట్స్ని వివిధ మెసేజ్‌లతో సైబర్ వేధింపులకు పాల్పడింది. ఆమె ఫేక్ ఐడింటిటీతో 2021 నుంచి ఆన్లైన్లో టీనేజర్లను ఇలా వేధింపులకు గురి చేసినట్లు తెలిసింది. ఈ మేరకు టినేజర్లను వేధింపులకు గురిచేస్తున్నట్లు బీల్ సిటీ పబ్లిక్ స్కూల్స్ ఫిర్యాదు దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ కేసును దర్యాప్తు చేసింది. విచిత్రమేమిటంటే సదరు మహిళ ఆ స్కూల్లోనే బాస్కెట్ బాల్ కోచ్‌గా పనిచేస్తోంది. ఐతే విచారణలో సదరు మహిళ ఫేక్ ఐడింటిలతో టీనేజర్లను లక్ష్యంగా వేధించే సందేశాలను పంపినట్లు పోలీసులు గుర్తించారు. తనను గుర్తుపట్టకుండా ఉండేలా సాఫ్ట్‌వేర్‌ను, వివిద ప్రాంతాల నెంబర్లను, కోడ్లను వినియోగించినట్లు తేలింది. సైబర్ పోలీసులు ఆమెను ఐపీ అడ్రస్ సాయంతో ఆమెను ట్రాక్ చేశారు. ఆమె తన కూతురికి లేదా ఆమె క్లాస్మేట్లకి పంపించిన సుమారు పదివేల టెక్స్ట్ మెసేజ్‌లను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు సదరు మహిళపై ఐదు ఆరోపణలు మోపి కోర్టు ముందు హజరపరిచారు. దీంతో ఆమె సైబర్ వేధింపులకు పాల్పడినందుకుగానూ 10 ఏళ్లు జైలు శిక్ష, నేరాన్ని తారుమారు చేసేందుకు యత్నించినందుకు గానూ మరో ఐదు ఏళ్లు జైలు శిక్ష ఎదుర్కొటోంది. ఐతే ఆమె ప్రస్తుతం తాజాగా సుమారు రూ. 4 లక్షల పూచికత్తుతో బెయిల్‌పై విడుదలయ్యింది. (చదవండి: చైనాలో నిమ్మకాయలకు అమాంతం పెరిగిన డిమాండ్! కారణం ఏంటంటే..) -
మిమ్మల్ని ట్రోల్ చేస్తున్నారా? అయితే..
Cyberbullying Prevention Tips: కొట్టి చంపడానికి కర్రలు, రాళ్లు అక్కర్లేదు. కొన్ని పదాలు కూడా చంపగలవు. ఈ రోజుల్లో సోషల్ మీడియా అంతటా ఉంటోంది. కుటుంబాలు, స్నేహితులు, ప్రకటన దారులు, ప్రముఖులు, సంస్థలు.. దాదాపు ప్రతి ఒక్కరూ దీనిని ప్రత్యక్షంగానో లేదా పరోక్షంగానో ఉపయోగిస్తున్నారు. ఓ ప్రఖ్యాత ఇంటర్నెట్ సర్వే సంస్థ ప్రకారం మన ప్రస్తుత ప్రపంచ జనాభా 7.75 బిలియన్లు ఉంటే ఇంటర్నెట్లో 4.54 బిలియన్లు, మొబైల్లో 5.19 బిలియన్లు, సోషల్ మీడియాలో 3.8 బిలియన్ వినియోగదారులు ఉన్నారు. సగటున కనీసం 25% మంది వినియోగదారులు తమ వినియోగ సమయంలో నిస్సందేహంగా ఏదో ఒకరకమైన సోషల్ మీడియా ట్రోల్‌కు లోనవుతున్నారు. ఇంటర్నెట్లోని దాదాపు ప్రతిమూలలో కనిపించే రుగ్మత ఏకైక ఉద్దేశం వివాదాస్పద ప్రకటనలు చేయడం ద్వారా ట్రోల్ లేదా సోషల్ మీడియా సైట్లలో సంఘర్షణను, సమస్యలను సృష్టిస్తున్నాయి. ఇది ఒక వ్యక్తి సామాజిక శ్రేయస్సు, భావోద్వేగ శ్రేయస్సును ప్రభావితం చేస్తుంది. ఆన్లైన్ ట్రోలింగ్ దుర్వినియోగం వల్ల మానసిక, శారీరక ఒత్తిడి ఏర్పడుతుంది. వ్యక్తిగత గుర్తింపు, విశ్వసనీయత, ఆర్థిక, ఇతర పరిణామాలకు దారితీయవచ్చు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, చర్యలతో సాంకేతిక దుర్వినియోగం జరుగుతోంది. అవమానించే చర్యలకు పాల్పడటం, అభ్యంతరకరమైన సందేశాలు పంపడం, వ్యక్తిత్వాన్ని కించపరచడం, విభేదాలను, వివాదాలను సృష్టించే ఉద్దేశంతోనే ఒక వ్యక్తి ట్రోల్‌కి పాల్పడతాడు. ట్రోల్‌కి అడ్డా... ట్రోల్ చేసేవారు నకిలీ ఆన్లైన్ అకౌంట్లను సృష్టిస్తారు. ఇలాంటివారు బ్లాగింగ్ సైట్లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఇంటర్నెట్ చాట్‌రూమ్‌లు, ఇమెయిల్స్/వాట్సప్ గ్రూప్స్, చర్చావేదికలు, బ్లాగులు.. లేదా ఏదైనా ఇతర ఆన్లైన్ ఫార్మాట్లలోనో పొంచి ఉంటారు. గుర్తించే విధం... ట్రోల్ చేసిన వారి బయోడేటా, పేరు, ఫొటో అస్పష్టంగా ఉంటాయి. ఫేక్ ఐడీలను సృష్టిస్తారు. వారు ఎక్కడ నుండి వచ్చారు, పని ఏంటి.. అనే విషయాలన్నీ అస్పష్టంగానే ఉంటాయి. వీరికి తక్కువమంది ఫాలోవర్లు ఉంటారు. వీరి పోస్ట్‌లు చాలా వరకు ఇతరులతో సంభాషణ, డైలాగ్‌లు పంచుకున్నట్టు ఏమాత్రం కనిపించవు. చాలా తక్కువమంది వ్యక్తుల పోస్ట్‌ల రీ ట్వీట్ చేయడం వంటివి గమనింవచ్చు. కోపంగా లేదా రెచ్చగొట్టే వ్యాఖ్యలను పోస్ట్ చేస్తారు. ∙అనేక సంస్థలు లేదా ప్రస్తుత సమస్యతో సంబంధం లేని వ్యక్తులను ట్యాగ్ చేస్తారు. అభ్యంతరకరమైన, దూషించే భాషను ఉపయోగిస్తారు. ∙తరచూ వ్యాఖ్యల వరదను పోస్ట్ చేసి, ఆపై టాపిక్‌ని మారుస్తారు. మీ పనికి సంబంధించిన సమస్యలపై చాలా అరుదుగా పోస్ట్ చేస్తారు. పెస్ట్ కంట్రోల్... పంటను కాపాడుకోవడానికి పురుగు మందులను ఎలా ఉపయోగిస్తామో, అలాగే సామాజికంగా ఉండాలనుకునేవారు ప్రతికూల వ్యాఖ్యలను నివారించడానికి సిద్ధంగా ఉండాలి. మీ వ్యూవర్స్‌తో ఇంటరాక్ట్ అవ్వాలనుకుంటే ప్రతికూల వ్యాఖ్యలను జాగ్రత్తగా నిర్వహించినప్పుడే వాటికి విలువ పెరుగుతుంది. విస్మరిస్తే ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఏదో తప్పు జరిగేవరకు వేచి చూడకూడదు. సంస్థాగత దృక్కోణమూ అవసరమే.. ►ఆన్లైన్లో మీ కమ్యూనిటీ హౌస్ రూల్స్ ఏంటో తెలుసుకోండి. ∙సరైన టూల్స్‌ని ఎంపిక చేసుకోవాలి. ►మీ కాంటాక్ట్స్ జాబితాలో అత్యవసరంలో స్పందించేది ఎవరో గుర్తించండి. ►మీరు నిర్వహిస్తున్న ఛానెల్ చట్టపరమైన, నియంత్రణ, నైతిక అవసరాలనే గుర్తించండి. ►గత అనుభవాలను ఆధారంగా తీసుకొని జాగ్రత్త పడటం మంచిది. వ్యక్తిగత దృక్కోణం... ►ఎలాంటి వ్యాఖ్యలు అనుమతిస్తారో, ఎలాంటివి అనుమతించరో ముందే ఒక విధానాన్ని రూపొందించుకోవచ్చు. ∙మీ సామాజిక ప్రొఫైల్‌ను తనిఖీ చేసినట్టుగా ఉంటే, ట్రోలర్ గుర్తింపును సులువుగా తెలుసుకోవచ్చు. ►మీ వెబ్సైట్/సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయితే మీరు ‘చెడు’ అనే వ్యాఖ్యలను తొలగించవచ్చు లేదా సభ్యుల జాబితా నుంచి తొలగించవచ్చు. ►మీ సైట్లో కార్యకలాపాలను పర్యవేక్షించడానికి మోడరేట్ని ఉపయోగించండి. ►మీకు భారీ ఫాలోవర్ జాబితా ఉంటే ఆన్లైన్ టూల్‌ని కొనుగోలు చేయండి. ►మీ చుట్టూ ఒక అనుచరులను సంఘాన్ని సృష్టించవచ్చు. వీరిలో నిష్ణాతులను ఎంపిక చేసుకోవచ్చు. ►కామెంట్ /వ్యాఖ్యకు వెంటనే రిప్లై ఇవ్వడం మంచిది. దీనివల్ల రాబోయే వివాదానికి ముందే అడ్డుకట్టపడుతుంది. ►మీవల్ల తప్పు జరిగిందని భావిస్తే వెంటనే ‘క్షమించండి’ అని చెప్పండి. దీనివల్ల చాలాసార్లు ట్రోల్‌కు అడ్డుకట్ట పడుతుంది. అదే సమయంలో మిమ్మల్ని ప్రశంసిస్తారు కూడా. ‘ట్రోల్’... రిపోర్ట్... ఎ) మీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌నే ఒక రిపోర్ట్‌గా తీసుకోవచ్చు బి) సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేయవచ్చు. సి) ఆన్లైన్లో https://www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయవచ్చు. డి) డిజిటల్ వెల్బీయింగ్, ఇంటర్నెట్ ఎథిక్స్ సపోర్ట్ గ్రూప్‌లు ఐ ఉఅ, ఇఈఅఇ విభాగం, ఎండ్ నౌ ఫౌండేషన్, సైబర్ గర్ల్, సైబర్ జాగృతి, CyberPsy, పోలీస్ మహిళా భద్రతా విభాగం, మహిళలు, పిల్లలు, యుక్తవయస్కులు, ఆన్లైన్ వేధింపులను ఎదుర్కోవడానికి వాలంటీర్ల నిర్వహణలో ఉన్న అనేక ఇతర సంస్థల సిబ్బందికి తెలియజేయవచ్చు. ట్రోల్‌కి ప్రధాన కారణం మానసిక సమస్యలే! మూడేళ్లుగా ట్రోలింగ్ చేసేవారి ప్రవర్తనను అధ్యయం చేశాం. మానసిక సమస్యల కారణంగానే ట్రోలర్స్ ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం అని తెలుసుకున్నాం. ఈ విషయంపై మనస్తత్వవేత్తలు, డిజిటల్ వెల్బీయింగ్ నిపుణులతో చర్చించి నిర్ణయానికి వచ్చాం. ట్రోల్ చేసేవారిలో.. తీవ్రమైన సామాజిక, మానసిక సమస్యలను గుర్తించాం. లైంగిక సమస్యలు ఎదుర్కొనేవారు ముఖ్యంగా.. బాల్యంలో వేధింపులకు లోనైనవారు, మానసిక ఆరోగ్యసమస్యలు ఉన్నవారు, జంతుప్రవృత్తి గలవారిలో, రాజకీయ లేదా వ్యక్తిగత ద్వేషం ఉన్నవారు ట్రోల్‌కి పాల్పడుతుంటారు. వీరిలో దాదాపు 60 శాతం మంది పిల్లలపై లైంగిక చర్యలకు పాల్పడినవారు ఉన్నారని తెలిసింది. ట్రోలింగ్, సైబర్ స్టాకింగ్, సైబర్‌బుల్లీ... వీటన్నింటి మధ్య ‘వేధింపు’ అనే ఒక కత్తి ఉందన్నది వాస్తవం. సైబర్ బెదిరింపు, ట్రోలింగ్ సమస్య అంతం కానప్పటికీ చట్టం అమలు, ఇతర ప్రభుత్వ సంస్థలతో కలిసి పని చేసే స్వచ్ఛంద సమూహాల విస్తరణ ప్రజలకు పోరాడటానికి, గెలవడానికి అవకాశం కల్పిస్తోంది. -అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్. చదవండి👉🏾 నిశ్చితార్ధం ఫిక్స్ అయింది కదా అని, వ్యక్తిగత వీడియోలు షేర్ చేసినందుకు.. -
నేనూ ట్రోలింగ్‌కు గురయ్యా.. పీవీ సింధు కీలక వ్యాఖ్యలు
PV Sindhu Comments On Cyber Bullying And Trolling: సైబర్ నేరాలపై మహిళలు, పిల్లలను చైతన్య పరిచేందుకు నిర్వహించిన ఓ కార్యక్రమంలో భారత స్టార్ షట్లర్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత పీవీ సింధు కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను చాలా సందర్భాల్లో ట్రోలింగ్‌కు, సైబర్ బుల్లియింగ్‌కు గురయ్యానని ఆమె వెల్లడించారు. అయితే వీటిని తాను చాలా ధైర్యంగా ఎదుర్కొన్నానని, మహిళలు, పిల్లలు కూడా ఇలాంటి సందర్భాల్లో అధైర్యపడకుండా పోలీసుల సహకారంతో సైబర్ అటాక్‌లకు చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు. ఇటీవలి కాలంలో ఇంటర్నెట్ వినియోగం పెరగడంతో సైబర్ నేరాలు భారీగా పెరిగాయని, ఇందులో ప్రధానంగా మహిళలు, పిల్లలే బలవుతున్నారని వాపోయారు. ఆన్లైన్ క్లాసుల నేపథ్యంలో తల్లిదండ్రులు నిరంతరం పిల్లలను గమనిస్తూ ఉండాలని, వారు ఏదైనా సమస్యను ఎదుర్కొంటే వాటిని అధిగమించేందుకు అందుకు తగిన చైతన్యం వారిలో నింపాలని సూచించారు. మహిళల భద్రతకు షీ టీమ్స్ లాగే, సైబర్ మోసాలకు సైబర్ వారియర్లు ఉన్నారనే విషయాన్ని గుర్తించాలని కోరారు. సైబర్ నేరాల బారిన పడిన వారు నిస్సంకోచంగా సమీపంలోని పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయాలని అన్నారు. కార్యక్రమంలో ముఖ్య అతిధులుగా మహిళా భద్రతా విభాగం అడిషనల్ డీజీ స్వాతి లక్రా, ఐజీ బి సుమతి పాల్గొన్నారు. చదవండి: అంపైర్‌ను బూతులు తిట్టిన స్టార్ ప్లేయర్‌కు భారీ జరిమానా -
ప్రేయసికి అవమానం: ప్రతీకారం తీర్చుకున్నాడు
రాజ్‌కోట్: ఐదేళ్ల క్రితం తన ప్రేయసికి జరిగిన అవమానానికి విభిన్న రీతిలో ప్రతీకారం తీర్చుకున్నాడు ఓ యువకుడు. తమిళనాడుకు చెందిన 24 ఏళ్ల తమిళసెల్వన్ కన్నన్.. 2015లో తన ప్రేయసిని అసభ్యకరంగా చిత్రీకరించి,సైబర్ వేధింపులకు గురి చేసిన ఆమె సహా వైద్య విద్యార్ధులందరిపైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. నిందితుడు తన ప్రతీకారం తీర్చుకునేందుకు విభిన్న రీతిని ఎంచుకొని, దేశవ్యాప్తంగా ఉన్న వైద్యవిద్యార్ధుల ల్యాప్‌టాప్‌లను టార్గెట్ చేశాడు. గుజరాత్‌లోని జామ్‌నగర్ పోలీసులు ఓ ల్యాప్‌టాప్ దొంగను అదుపులోకి తీసుకొని విచారిస్తుండగా, ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రతీకారేచ్ఛలో భాగంగా నిందితుడు ఇప్పటివరకు 500 మంది మెడికోల ల్యాప్‌టాప్‌లు దొంగిలించానని చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. చోరీలకు పాల్పడేందుకు నిందితుడు ఇంటర్నెట్లో మెడికల్ కాలేజీల సమాచారం సేకరించి, ఆ తరువాత రెక్కీ నిర్వహించి మరీ చోరీలకు పాల్పడేవాడని పోలీసుల విచారణలో పేర్కొన్నాడు. తాను చోరి చేసిన ల్యాప్‌టాప్‌లు ఎక్కువ శాతం దక్షిణ భారత దేశంలోని మెడికల్ కళాశాలకు చెందిన విద్యార్ధులవిగా పేర్కొన్నాడు. నిందితుడు చివరిగా గతేడాది డిసెంబర్లో జామ్ నగర్‌లోని ఎంపి షా మెడికల్ కాలేజీ బాలికల హాస్టల్ నుంచి ఐదు ల్యాప్‌టాప్‌లు దొంగిలించినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. -
సైబర్ వల.. యువత విలవిల
♦దేశంలో పెరుగుతున్న సైబర్ బుల్లీయింగ్ బాధితులు ♦ఆత్మన్యూనతకు, కుంగుబాటుకు గురవుతున్న యువత ♦తల్లిదండ్రుల అప్రమత్తతే రక్ష అంటున్న నిపుణులు ♦చర్యలు తీసుకోవడానికి తగిన చట్టాలు లేవు ►ఓ విద్యార్థిని స్నానం చేస్తుండగా ఓ ఆకతాయి తన సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి ఆమెను బ్లాక్మెయిల్ చేస్తాడు. ఆ విద్యార్థిని, ఆమె తల్లి ఎంతగా బతిమిలాడినా వినిపించుకోడు. ఆమె తల్లితోనూ అసభ్యంగా ప్రవర్తిస్తాడు. విధిలేని పరిస్థితుల్లో ఆ తల్లి ఆ ఆకతాయిని కొట్టి చంపుతుంది. ఇది వెంకటేశ్ హీరోగా నటించిన ‘దృశ్యం’ సినిమాలోని సన్నివేశం. వర్తమాన ప్రపంచంలో యువత ఎదుర్కొంటున్న సైబర్ ముప్పును ఆ సన్నివేశం ప్రభావవంతంగా చూపించగలిగింది. ►విజయవాడకు చెందిన ఓ విద్యార్థిని కాలేజ్ ఫ్రెషర్స్ డే వేడుకలో తీసుకున్న ఫొటోలను సామాజిక మాధ్య మాల్లో పోస్టు చేసింది. ఆమెకు బాగా తెలిసిన సహ విద్యార్థి ఆ ఫొటోను మార్ఫింగ్ చేసి అసభ్యకర కామెంట్స్‌తో తన స్నేహితులకు షేర్ చేశాడు. దీంతో ఆ విద్యార్థిని తీవ్ర అవమానానికి గురై ఆత్మహత్యకు ప్రయత్నించింది. ►బ్లూ వేల్... ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తోన్న ఆన్లైన్ గేమ్. ఈ వికృత క్రీడ యువత, విద్యార్థులను ఆత్మహత్యకు పురిగొల్పుతోంది. సాక్షి, అమరావతి : ప్రస్తుతం పిల్లలు, యువత ఇలాంటి ఎన్నో సైబర్ బాధితులుగా మారుతున్నారు. మన ‘నెట్టిం’ట్లోకి.. తర్వాత స్మార్ట్‌ఫోన్ రూపంలో అర చేతిలోకి ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చేసింది. నాణేనికి రెండు పార్శా్వలు ఉన్నట్టు ఇంటర్నెట్కు రెండు కోణాలు ఉన్నాయి. ఒక వైపు ఇంటర్నెట్ను చక్కగా వాడుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మనకు తెలియని ఎన్నో విషయాల్లో పరిజ్ఞానం పొందొచ్చు. విభిన్న విజ్ఞాన అంశాలను తెలుసుకోవచ్చు. మరోవైపు నెట్ వేదికగా ఎన్నో మోసాలు, సైబర్ నేరాలు వెలుగుచూస్తున్నాయి. ప్రధానంగా భవిష్యత్‌పైన దృష్టి పెట్టాల్సిన విద్యార్థులు స్మార్ట్ఫోన్లకు బానిసలవుతున్నారు. బ్లూవేల్ లాంటి ప్రమాదకరమైన ఆన్లైన్ గేమ్‌లు ఆడుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆత్మన్యూనత.. కుంగుబాటు సైబర్ బుల్లీయింగ్ విద్యార్థులు, యువత మీద తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఆత్మన్యూనతకు, కుంగుబాటు (డిప్రెషన్)కు గురవుతున్నారు. చదువుపై శ్రద్ధ పోతోంది. వ్యసనాలకు బానిసలు అవుతున్నారు. కుటుంబ, మానవ సంబంధాలు క్షీణిస్తున్నాయి. వేధింపులు తీవ్రంగా ఉన్న కేసుల్లో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచనలూ ఆవహిస్తున్నాయి. వేధింపులు ఎక్కువ.. కేసులు తక్కువ ఇంతగా సైబర్ బుల్లీయింగ్ పెరుగుతున్నా దేశంలో అధికారికంగా కేసులు మాత్రం చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి. వీటి గురించి తల్లిదండ్రులకు తెలియకపోవడమే దీనికి ప్రధాన కారణం. కొన్నిసార్లు తెలిసినా గౌరవభంగమనే ఉద్దేశంతో పోలీసులకు ఫిర్యాదు చేయడానికి సంకోచిస్తున్నారు. ఫిర్యాదు చేసినప్పటికీ సైబర్ బుల్లీయింగ్ నిందితులను శిక్షించడానికి దేశంలో తగిన చట్టం లేదు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో పెళ్లి సంబంధం కుదిరిన ఓ యువతి ఫొటోలను ఆమె మద్యం తాగుతున్నట్లుగా ఓ ఆకతాయి మార్ఫింగ్ చేసి పోస్టు చేశాడు. దాంతో మగపెళ్లివారు ఆ పెళ్లి సంబంధాన్ని రద్దు చేసుకున్నారు. దీనిపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ సరైన చట్టం లేకపోవడంతో ఆ ఆకతాయిని శిక్షించలేకపోయారు. రాజకీయ దుర్వినియోగమే శాపం ప్రభుత్వాలు రాజకీయ కక్ష సాధింపునకు ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను దుర్వినియోగం చేశాయి. అందుకే శ్రేయా సింఘాల్ కేసును విచారించిన సుప్రీంకోర్టు ఆ చట్టాన్ని 2015లో కొట్టేసింది. బాలలు, యువతపై సైబర్ బుల్లీయింగ్ వేధింపులను అరికట్టడానికి ప్రత్యేక చట్టం చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. కానీ ప్రభుత్వం ఇంతవరకు ఆ దిశగా చొరవ చూపకపోవడం వల్ల సైబర్ బుల్లీయింగ్‌కు పాల్పడేవారిని శిక్షించలేకపోతున్నామని ఓ పోలీసు ఉన్నతాధికారి చెప్పారు. అప్రమత్తత.. అవగాహన.. పిల్లలు ఆన్లైన్ వేధింపులకు గురికాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండటం ఒక్కటే మార్గమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. పిల్లలతో ఎక్కువగా మాట్లాడుతూ ఇంటి వాతావరణాన్ని అహ్లాదంగా ఉంచాలి. సామాజిక మాధ్యమాల్లో పిల్లల వ్యవహారాలను ఓ కంట కనిపెడుతూ ఉండాలి. ఆన్లైన్ వేధింపులపై వారికి తగిన అవగాహన కల్పించాలి. ల్యాప్‌టాప్, సెల్‌ఫోన్ తదితర ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు సరైన సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేసుకోవాలి. సైబర్ బుల్లీయింగ్‌కు గురైతే వెంటనే తమకు తెలపాలని తల్లిదండ్రులు పిల్లలకు చెప్పాలి. అవసరమైతే వెంటనే పోలీసులను ఆశ్రయించాలి. తల్లిదండ్రుల అప్రమత్తతే శ్రీరామరక్ష పిల్లలు సైబర్ బుల్లీయింగ్‌కు గురయ్యారనే విషయాన్ని ఎక్కువమంది తల్లిదండ్రులు గుర్తించడం లేదు. పిల్లలు డల్‌గా ఉంటున్నారు, సరిగా చదవడం లేదని మా వద్దకు తీసుకువస్తున్నారు. వారిని విచారిస్తే తాము సైబర్ బుల్లీయింగ్‌కు గురయ్యామని చెబుతున్నారు. తల్లిదండ్రులు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండాలి. అభ్యంతరకరమైన సైట్లు చూడకుండా జాగ్రత్త పడాలి. ఐడెంటిటీనీ గోప్యంగా ఉంచే సైట్లు ప్రమాదకరమైనవి. వాటికి దూరంగా ఉండాలి. అభ్యంతర సంభాషణలు, పోస్టులకు పిల్లలు స్పందించకూడదు. వారు ఒకసారి స్పందిస్తే ఇక వారిని వెంటాడి వేధిస్తారు. సైబర్ బుల్లీయింగ్‌కు గురైనవారు తామేదో తప్పు చేశామనే ఆత్మన్యూనతకు గురికాకూడదు. తల్లిదండ్రులకు విషయాన్ని చెప్పి ఆ సమస్య నుంచి బయటపడాలి.– డాక్టర్ ఇండ్ల విశాల్, చిన్నపిల్లల మానసిక వైద్య నిపుణుడు, విజయవాడ సైబర్ బుల్లీయింగ్ అంటే.. ఎలక్ట్రానిక్ సమాచార వ్యవస్థ అంటే... ఈమెయిళ్లు, సామాజిక మాధ్యమాలు, టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా ఇతరులకు హాని, బాధ కలిగించడమే సైబర్ బుల్లీయింగ్. కొందరు అభ్యంతరకర పోస్టింగులు పెడుతుంటారు. మరికొందరు ఆన్లైన్ ద్వారా లైంగిక వాంఛలు వ్యక్తీకరించి వేధిస్తుంటారు. ఇంకొందరు కొన్ని లింకులు పంపిస్తారు. వాటిపై క్లిక్ చేస్తే అసభ్యకర సందేశాలు, చిత్రాలు వస్తాయి. ఫొటోల మార్ఫింగ్ చేసి, సంభాషణలను ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తుంటారు. ఇలా చేస్తామని బెదిరిస్తూ లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇవన్నీ కూడా సైబర్ బుల్లీయింగ్ కిందకు వస్తాయి. విస్తరిస్తున్న సైబర్ బుల్లీయింగ్ సిమన్టెక్ అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ భారత్‌తోపాటు అమెరికా, బ్రిటన్, కెనడా, బ్రెజిల్, ఇటలీ, యూఏఈ, చైనా, జపాన్, ఆస్ట్రేలియాల్లో సర్వే నిర్వహించింది. ఇందులో భాగంగా 13 ఏళ్ల నుంచి 64 ఏళ్లలోపు వారిని సర్వే చేశారు. వారిలో పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా ఉన్నారు. మన దేశంలో మెట్రోపాలిటన్ నగరాలతోపాటు చిన్న నగరాల్లోనూ సర్వే నిర్వహించారు. భారతదేశంలో సర్వే చేసిన నగరాల్లో 52 శాతం మంది పిల్లలు తాము ఎంతో కొంత సైబర్ బుల్లీయింగ్ బారినపడ్డామని చెప్పారు. తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో 30 శాతం మంది సైబర్ బుల్లీయింగ్ బాధితులేనని వెల్లడైంది.