
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె డ్రెస్సింగ్‌పై ఈ మధ్యకాలంలో ట్రోలింగ్ ఎక్కువవుతుంది. తాజాగా తన తర్వాతి సినిమా షూటింగ్‌లో పాల్గొనేందుకు ముంబై ఎయిర్‌పోర్టుకు వచ్చిన దీపిక బిగుతైన రెడ్ కలర్ డ్రెస్‌లో కనిపించింది. క్యాప్, హ్యాండ్‌బ్యాగ్ కూడా ఎరుపు రంగులో ఉన్నాయి. దీనికి తోడు హై హీల్స్ వేసుకుంది. అవి కూడా రెడ్ కలర్‌లోనే ఉండటం విశేషం. దీంతో నెటిజన్లు దీపికాను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.
అచ్చం జొమాటో డెలివరీ గర్ల్‌లా ఉందని, ఎప్పటిలాగే ఆమె డ్రెస్సింగ్ స్టైల్లో విఫలమైందని కామెంట్లు చేస్తున్నారు. మరికొందరేమో రణ్‌వీర్ సింగ్ వింత ఫ్యాషన్ దీపిక పాటిస్తుందని, ఈ డ్రెస్ కూడా రణ్‌వీర్ డిజైన్ చేసి ఉండొచ్చని ట్రోల్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. రీసెంట్‌గా గెహ్రియాన్‌తో హిట్ అందుకున్న దీపిక ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన 'ప్రాజెక్ట్ కే' లో నటిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment