'దిల్‌ రాజుపై నెగెటివ్ ట్రోల్స్‌'.. ఫ్యామిలీ స్టార్‌ నిర్మాత ఇంట్రెస్టింగ్ కామెంట్స్! | Tollywood Director Dil Raju Responds On Negative Trolls Goes Viral | Sakshi
Sakshi News home page

Dil Raju: 'మనం స్కై లాంటి వాళ్లం'.. ట్రోల్స్‌పై దిల్‌ రాజు ఆసక్తికర కామెంట్స్!

Published Thu, Apr 4 2024 7:51 PM | Last Updated on Thu, Apr 4 2024 8:05 PM

Tollywood Director Dil Raju Responds On Negative Trolls Goes Viral - Sakshi

టాలీవుడ్‌లో అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. ప్రస్తుతం ఆయన విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్‌ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించింది. పరశురామ్ ‍పెట్ల దర్శకత్వంలో తెరకెక్కించిన ఈ చిత్రం ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీత గోవిందం తర్వాత పరశురామ్- విజయ్ దేవరకొండ కాంబోలో వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లతో బిజీగా చిత్రయూనిట్ మీడియా ప్రతినిధులతో ఇంటరాక్షన్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిగిన ప్రశ్నలకు దిల్‌ రాజు సమాధానలిచ్చారు. గతంలో మీపై వచ్చిన నెగెటివ్‌ ట్రోల్స్‌ను మీరేలా అధిగమించారు? అనే ప్రశ్నకు తనదైన శైలిలో ఆన్సరిచ్చారు. 

దిల్‌ రాజు మాట్లాడుతూ.. 'నా మీద మీమ్స్ వచ్చాయనే విషయంపై నాకు అవగాహన కూడా లేదు. నేను ఓ ఇంటర్వ్యూలో నా పెళ్లి గురించి ప్రస్తావించా. దాని గురించి మస్తుగా చూపించారు. తెలుగు రాష్ట్రాల్లో నన్ను గుర్తు పట్టేవాళ్లు దాదాపు ఒక కోటి మంది ఉంటారు. నాపై కామెంట్స్ పెట్టినవాళ్లు ఒక పదివేల మంది ఉంటారు. కాబట్టి వాళ్ల గురించి ఆలోచిస్తే మిగిలినవాళ్లకు దూరమవుతా. మనం నెగెటివ్ వైబ్‌లో బతుకుతున్నాం. ఇంట్లో కూడా అలానే ఉంటున్నాం. అలా మనకు తెలియకుండానే హెల్త్‌ను పాడు చేసుకుంటాం. ఆ నెగెటివ్‌ను మన దగ్గరకు రాకుండా జాగ్రత్తపడాలి. అవన్నీ జస్ట్ పాసింగ్ క్లౌడ్స్‌. అవేమైనా నన్ను చంపేస్తాయా? చంపలేవుగా. పాసింగ్ క్లౌడ్స్ పోయాక మనకు క్లియర్‌గా ఆకాశమే కనిపిస్తుంది. మనం స్కై లాంటి వాళ్లం. క్లౌడ్స్‌కు భయపడితే ఎలా? ' అని అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement