ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు.. వార్నింగ్‌ ఇచ్చిన అరియాన | Ariyana Glory Reacts To Netizens Trolls About Her Latest Look In Photos - Sakshi
Sakshi News home page

Trolls On Ariyana Glory: వాడు ఎలా ఉంటాడో ఒక ఫోటో పెడితే.. ఫైర్‌ అయిన అరియానా

Published Mon, Oct 9 2023 3:01 PM | Last Updated on Mon, Oct 9 2023 3:19 PM

Ariyana Glory Respond To Trollers - Sakshi

యాంకర్‌గా కెరీయర్‌ ప్రారంభించి బిగ్ బాస్ బ్యూటీగా పాపులర్ అయిన అరియానా గ్లోరీ అందరికీ పరిచయమే. తన ఫోటోలను ఎప్పుడూ  సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ తన ఫ్యాన్స్‌తో టచ్‌లో ఉంటుంది ఈ బ్యూటీ. ఒక్కోసారి తనపై ఎన్ని కామెంట్లు వచ్చినా వాటిని లెక్కచేయకుండా.. తనకు నచ్చింది ఓపెన్‌గా మాట్లాడటంలో ఆమె ఎప్పుడూ ముందుంటుంది. మొదట ఆర్జీవీ ఇంటర్వ్యూతో గుర్తింపు పొందిన ఆమె బిగ్‌బాస్‌ రియాలిటీ షోతో మరింత పాపులర్‌ అయ్యింది. చలాకీతనం, ముక్కుసూటితనంతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను అరియానా  సొంతం చేసుకుంది.

(ఇదీ చదవండి: స్టేజీపై బతుకమ్మ ఆడిన కాజల్‌, శ్రీలీల.. వీడియో వైరల్‌)

బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లొచ్చాక పలు ఎంటర్‌టైన్​మెంట్ ఛానెళ్లలో ప్రోగ్రామ్స్‌తో పాటు సెలబ్రిటీల ఇంటర్వూల పేరుతో అరియానా గ్లోరీ ప్రత్యేకమైన ఐడెంటిటీ సొంతం చేసుకుంది. కానీ ఆమె కొన్నిరోజులపాటు స్క్రీన్‌కు దూరంగా ఉండటం జరిగింది. దీంతో ఆమె కొంచెం బొద్దుగా తయారైంది. ఈ క్రమంలో ఆమె ఫోటో షేర్‌ చేసినా.. వీడియో షేర్‌ చేసినా ట్రోలర్స్‌ దారుణమైన కామెంట్లు చేయడం ప్రారంభించారు. మరికొందరైతే అరియానా పట్ల బాడీ షేమింగ్‌ కూడా చేశారు. అలాంటి వారికి ఆమె స్టైల్‌ల్లో సమాధానం ఇచ్చిపడేసింది.

పనికి మాలిన వేస్ట్ ఫెల్లోస్ కోసం ఇది చెబుతున్నా.. నేను సన్నగా ఉంటే..? సన్నగా ఉన్నావ్ అన్నారు. సర్లే అని లావు అయితే.. ఏంటి ఇంత లావుగా ఉన్నావు. ఆంటీలా అయ్యావ్ అని అంటున్నారు. ఇలాంటి కామెంట్లు చేసే వాడు ఎలా ఉంటాడో ఒక ఫోటో పెడితే మేం కూడా చూస్తాం కదా..? నీకు నాతో ఏమైనా ఇబ్బంది ఉంటే అన్ ఫాలో కొట్టొచ్చు కదా..? నేను ఎలా ఉంటే నీకేంటి..? సన్నగా ఉంటే నీకేంటి..? లావుగా ఉంటే నీకేంటి..? నా జీవితంలో ముందుకు వెళ్లేందుకు కనీసం నేను ఏదో ఒక ప్రయత్నం చేస్తున్నాను.

నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి కామెంట్ చేయ్.. నేను ఎలా ఉంటే నీకేంటి..? కొంచెం మనసు పెట్టి ఆలోచించండి. ఏదుటివారి మీద పడి ఎందుకు ఏడుస్తారు. పనీ పాట లేకపోతే ఏదైనా ఓ పని చేసుకోవచ్చు కదా అని  ట్రోలర్స్‌పై అరియానా విరుచుకుపడింది. ప్రస్తుతం ఆమె పలు డ్యాన్స్‌ కార్యక్రమాల్లో పాల్గొంటున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement