Lakshmi Manchu Trolled by Netizens for Her Latest Instagram Post - Sakshi
Sakshi News home page

Trolls On Manchu Lakshmi: మంచు లక్ష్మిపై ట్రోల్స్‌.. స్మగ్లర్‌ అం​టూ కామెంట్స్‌

Published Sun, May 29 2022 4:00 PM | Last Updated on Sun, May 29 2022 5:37 PM

Netizens Trolls Manchu Lakshmi Over Her Latest Instagram Post - Sakshi

మంచు వారి అమ్మాయి లక్ష్మి ప్రసన్నకు సోషల్‌ మీడియాలో ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటుందనే విషయం తెలిసిందే. అంతేకాదు ఆమె సొంతంగా ఓ యూట్యూబ్‌ చానల్‌ కూడా ఉంది. యూట్యూబ్‌ వేదికగా తరచూ హోంటూర్స్‌, ఇంట్లో సెలబ్రెషన్స్‌కు సంబంధించిన వీడియోలను పంచుకుంటూ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా తరచూ ఫొటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఆమె పోస్ట్‌ చేసిన ఓ ఫొటోకు నెటిజన్ల నుంచి ట్రోల్స్‌ ఎదుర్కొంటుంది. తన షూ కలెక్షన్స్‌ సంబంధించిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. తన ముందుకు 4 నుంచి 5 జతల షూలను ముందు పెట్టి బుగ్గ మూతి పెట్టుకని ఫొటోకి ఫోజ్‌ ఇచ్చింది.

దీనికి ‘ఎప్పడూ సరైన షూ దొరకదు’ అంటూ క్యాప్షన్‌ ఇచ్చింది. ఇది చూసిని కొందరు ఆమె నెగిటివ్‌ కామెంట్స్‌ చేస్తుండగా మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ‘కాళ్ళు కాలే కాళ్ళు ఒకచోట. లెక్క లేనన్ని జోల్లు ఒక చోట’, ‘నీ దగ్గర అన్ని జతలు ఉంటే.. అందులో కొన్ని పేద వాళ్లకు పంచోచ్చు కదా’ అంటూ కామెంట్స్‌ చేస్తుండగా మరికొందరూ ‘అంతేకాదు చెప్పులు షాప్‌ పెట్టారా?’, ‘షూ స్మగ్లర్‌’ అంటూ తన పోస్ట్‌పై ఫన్నీగా స్పందిస్తున్నారు. ​కాగా మంచు లక్ష్మి ప్రస్తుతం మలయాళం సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ చిత్రంలో ఓ ప్రధాన పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ఆమె ఓ పోలీసు ఆఫీసర్‌ పాత్ర పోషిస్తుందని సమాచారం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement