IPL 2023: Golden Duck for Aiden Markram on SRH Captaincy Debut Vs LSG - Sakshi
Sakshi News home page

Aiden Markram: కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే గోల్డెన్‌ డక్‌.. ఏం ఎంట్రీ అన్నా!

Published Fri, Apr 7 2023 8:45 PM | Last Updated on Fri, Apr 7 2023 9:00 PM

IPL 2023: Golden Duck For Aiden Markram On SRH Captaincy Debut Vs LSG - Sakshi

Photo: Jio Cinema Twitter

''అన్నొచ్చేశాడు.. ఇక ఎస్‌ఆర్‌హెచ్‌ కథ మారిపోనుంది''.. ''మార్క్రమ్‌ ఎంట్రీతో ఎస్‌ఆర్‌హెచ్‌లో కొత్త జోష్‌ కనిపిస్తుంది''..'' కొత్త కెప్టెన్సీలో ఎస్‌ఆర్‌హెచ్‌ అదరగొట్టనుంది''.. ''వాతి(మార్క్రమ్‌) కమింగ్‌.. బి కేర్‌ఫుల్‌ అపోజిట్‌ టీం మెంబర్స్‌''.. మార్క్రమ్‌ ఎరా మొదలైంది.. ఇక ఎవరు ఆపలేరు''.. ఇదంతా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌కు ముందు ఎయిడెన్‌ మార్క్రమ్‌ ఎంట్రీ గురించి ఎస్‌ఆర్‌హెచ్‌ ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియలో ఇలా ఊదరగొట్టారు.

కట్‌చేస్తే.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌ ఆడుతున్న మార్క్రమ్‌ గోల్డెన్‌ డకౌట్‌ అయ్యాడు. లక్నోతో మ్యాచ్‌లో కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. కనీసం బంతిని కూడా అంచనా వేయడంలో విఫలమైన మార్క్రమ్‌ పేలవ రీతిలో క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. మార్క్రమ్‌ వచ్చాడు ఏదో చేస్తాడనుకుంటే ఇలా గోల్డెన్‌ డకౌట్‌ అవ్వడం ఏంటని ఎస్‌ఆర్‌హెచ్‌ అభిమానులు మండిపడ్డారు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే గోల్డెన్‌ డక్‌.. ఏం  ఎంట్రీ ఇచ్చావ్‌ అన్నా అంటూ వ్యంగ్యంగా పేర్కొన్నారు.

అయితే మార్క్రమ్‌ వచ్చినా ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటతీరు ఏ మాత్రం మారలేదు. పరుగులు చేయాల్సిన బ్యాటర్లు పోటీ పడి మరి వికెట్లు సమర్పించుకున్నారు. పార్ట్‌టైం బౌలర్‌గా వ్యవహరించే కృనాల్‌ పాండ్యా బౌలింగ్‌లో ముగ్గురు బ్యాటర్లు ఔటయ్యారంటే ఎస్‌ఆర్‌హెచ్‌ ఎంత బాగా బ్యాటింగ్‌ చేసిందో అర్థం చేసుకోవచ్చు.

చదవండి: ''గ్లాడియేటర్' సినిమా చూసినప్పుడల్లా ఏడుస్తా'

ఆ ముగ్గురు దిగ్గజాలు క్రికెట్‌ను ఏలేవారేమో!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement