IPL 2022: CSK Fans Troll Ravindra Jadeja After CSK Fell Short of PBKS Total By 11 Runs - Sakshi
Sakshi News home page

Ravindra Jadeja: 'మా కెప్టెన్‌ బౌలింగ్‌, బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌ చేయలేడు..'

Published Tue, Apr 26 2022 8:06 AM | Last Updated on Tue, Apr 26 2022 11:10 AM

IPL 2022: Fans Troll Ravindra Jadeja After CSK Loss Match PBKS By-11 Runs - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌ 2022 సీఎస్‌కే మరో పరాజయం చవిచూసింది. పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే ఆఖరి వరకు పోరాడినప్పటికి 11 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన  మ్యాచ్‌ల్లో ఇది ఆరో ఓటమి. దీంతో సీఎస్‌కే ప్లే ఆఫ్‌ అవకాశాలు సన్నగిల్లినట్లే. ఇక సీఎస్‌కే కెప్టెన్‌గా రవీంద్ర జడేజా తేలిపోయాడని అభిమానులు కామెంట్స్‌ చేశారు. అతను మామూలు ఆటగాడిగా ఉంటేనే ఆడతాడని.. కెప్టెన్సీ భారం అతనిపై స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఆల్‌రౌండర్‌ అనే ట్యాగ్‌ ఉన్న మా కెప్టెన్‌ బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ ఏది చేయలేకపోతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన మీమ్స్‌, ట్రోల్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన పంజాబ్‌ కింగ్స్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 17 పరుగులు చేసింది. శిఖర్‌ ధావన్‌ 88 పరుగులు నాటౌట్‌గా నిలిచి జట్టుకు భారీ స్కోరు అందించగా.. బానుక రాజపక్స 42 పరుగులు చేశాడు. అనంతరం బ్యాటింగ్‌ చేసిన సీఎస్‌కే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అంబటి రాయుడు 39 బంతుల్లోనే 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 78 పరుగులు వీరోచిత పోరాటం చేసినప్పటికి లాభం లేకపోయింది. రుతురాజ్‌ 30, జడేజా 21 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు.

చదవండి: IPL 2022: 'ఆ రెండు జ‌ట్లు కచ్చితంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయి'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement