
Photo: IPL Twitter
సీఎస్‌కే ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా టి20 క్రికెట్‌లో అరుదైన మైలురాయిని అందుకున్నాడు. రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో కెప్టెన్ సంజూ శాంసన్‌ను ఔట్ చేయడం ద్వారా జడ్డూ టి20ల్లో 200వ వికెట్(అంతర్జాతీయం సహా అన్ని మ్యాచ్‌లు కలిపి) సాధించాడు. అంతకముందే దేవదత్ పడిక్కల్‌ను ఔట్ చేసిన జడేజా ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీయడం విశేషం.
ఈ క్రమంలో టీమిండియా తరపున టి20 క్రికెట్‌లో 200 వికెట్లు పడగొట్టిన తొమ్మిదో బౌలర్‌గా జడేజా రికార్డులకెక్కాడు. కాగా ఈ 200 వికెట్లలో ఐపీఎల్ నుంచే జడేజాకు 139 వికెట్లు ఉండడం విశేషం. సీఎస్‌కే తరపున 100 వికెట్లు పడగొట్టిన బౌలర్లలో డ్వేన్ బ్రావో తర్వాత జడేజా మాత్రమే. ఇక అంతర్జాతీయంగా 51 టి20 మ్యాచ్‌లు ఆడిన జడేజా 61 వికెట్లు పడగొట్టాడు.
Welcome to Jadeja Rescue Services - for two wickets, dial 8️⃣ 🤘#CSKvRR #TATAIPL #IPLonJioCinema | @ChennaiIPL @imjadeja pic.twitter.com/vqBQCQ6sgZ
— JioCinema (@JioCinema) April 12, 2023
చదవండి: శాంసన్.. ప్లీజ్ ఇలాంటి రికార్డులు మనకొద్దు
Comments
Please login to add a commentAdd a comment