వెస్టిండీస్‌తో రెండో వన్డేలో ఓపెనర్‌గా వచ్చి అందరిని ఆశ్యర్యపరిచిన రిషబ్ పంత్ అంతగా ఆకట్టుకోలకపోయాడు. 34 బంతులాడి 3 ఫోర్లు సాయంతో 18 పరుగులు చేసి స్మిత్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే మ్యాచ్‌లో నిరాశపరిచిన పంత్.. సోషల్ మీడియాలో మాత్రం హిట్ అయ్యాడు. ఫ్యాన్స్ ట్రోల్స్‌కు గురయ్యాడు.. బ్యాటింగ్ విషయంలో ఆ ట్రోల్స్ వచ్చాయి అనుకుంటే పొరపాటే.
చదవండి: సూర్య తప్పు లేదు.. ఎందుకు ఆగావో తెలీదు; అనవసర రనౌట్
విషయంలోకి వెళితే.. పంత్ ఔటై పెవిలియన్ చేరాక కాసేపటికి బౌండరీ లైన్ వద్దకు వచ్చాడు. అక్కడ టీమిండియా ఫిజియో నితిన్ పటేల్, దీపక్ చహర్‌లతో కాసేపు ముచ్చటించాడు. అయితే పంత్ కూర్చున్న విధానం ఆసక్తిగా మారింది. గతంలో స్పిన్నర్ చహల్ ఒక మ్యాచ్‌లో బాయ్‌గా వ్యవహరించినప్పుడు డ్రింక్స్ అందించడానికి బౌండరీ లైన్ వద్ద మోచేతిపై కూర్చొని మ్యాచ్ వీక్షించడం కెమెరాలకు చిక్కింది. అది అప్పట్లో బాగా వైరల్ అయింది. తాజాగా పంత్ అది కాపీ కొట్టాడు. అయితే యాదృశ్చికంగా జరిగిందో లేక కావాలనే చేశాడో తెలియదు కానీ పంత్‌పై క్రికెట్ ఫ్యాన్స్ ట్రోల్స్ వర్షం కురిపించారు.
పంత్ ఫోటోను.. చహల్ అప్పటి ఫోటోను ఒక దగ్గర పెట్టి షేర్ చేశారు. ''సిగ్గుండాలి పంత్.. చహల్‌ను కాపీ కొట్టడానికి.. చహల్‌ది మాస్టర్ పీస్.. నీది(పంత్) కాపీ పీస్.. చహల్ మాస్టర్ పీస్‌ను దొంగలించావు.. యూ ఆర్ కాపీ క్యాట్.. పంత్ నీ కాపీ చెత్తగా ఉంది..'' అంటూ ఫన్నీ ట్రోల్స్ చేశారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ 64 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. కేఎల్ రాహుల్ 49 పరుగులు చేశాడు. దీపక్‌హుడా 29 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు.
చదవండి: భారత టెస్ట్ జట్టులో చోటు దక్కదని తెలిసి సాహా కీలక నిర్ణయం
#INDvWI Rishabh Pant 🤝Yuzi Chahal pic.twitter.com/iTI5pC5jOe
— Sudhanshu Ranjan Singh (@memegineers_) February 9, 2022
Just Rishabh Pant thinks 😂😭#INDvWI #INDvsWI pic.twitter.com/6gMYO5JKph
— CRICKET VIDEOS 🏏 (@AbdullahNeaz) February 9, 2022
Comments
Please login to add a commentAdd a comment