
టీమిండియా స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ వన్డేల్లో 100 వికెట్ల మైలురాయిని అందుకున్నాడు. విండీస్‌తో తొలి వన్డేలో నికోలస్ పూరన్‌ను ఔట్ చేయడం ద్వారా చహల్ ఈ ఘనత సాధించాడు. కాగా 100 వికెట్ల మైలురాయిని చహల్ 60 వన్డేల్లో సాధించాడు. ఈ నేపథ్యంలో టీమిండియా తరపున అత్యంత తక్కువ వన్డేల్లో వంద వికెట్లను తీసిన ఐదో ఆటగాడిగా చహల్ నిలిచాడు.
చహల్ కంటే ముందు మహ్మద్ షమీ(57 వన్డేలు), జస్‌ప్రీత్ బుమ్రా(57 వన్డేలు), కుల్దీప్ యాదవ్(58 వన్డేలు), ఇర్ఫాన్ పఠాన్(59 వన్డేలు) వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఈ మ్యాచ్ ద్వారా చహల్ మంచి కబ్‌బ్యాక్ ఇచ్చాడు. పూరన్‌ను ఔట్ చేసిన మరుసటి బంతికే విండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్‌ను గోల్డెన్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాతి ఓవర్లో 12 పరుగులు చేసిన బ్రూక్స్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించిన చహల్ మూడో వికెట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.
Least matches to 100 ODI wickets for India:
— Umang Pabari (@UPStatsman) February 6, 2022
56 : M Shami
57 : J Bumrah
58 : Kuldeep Yadav
59 : Irfan Pathan
60 : Yuzvendra Chahal*#INDvWI
Comments
Please login to add a commentAdd a comment