కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు | Minister Konda Surekha Slams Ktr | Sakshi
Sakshi News home page

కేటీఆర్‌పై కొండా సురేఖ సంచలన ఆరోపణలు

Published Wed, Oct 2 2024 1:35 PM | Last Updated on Wed, Oct 2 2024 6:22 PM

Minister Konda Surekha Slams Ktr

సాక్షి,హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారకరామారావుపై తెలంగాణ మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలకు దిగారు. ప్రముఖ హీరోహీరోయిన్లు నాగచైతన్య, సమంతలు విడిపోవడానికి కేటీఆరే కారణమని అన్నారామె.  

తనపై తాజాగా కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యల మీద కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ..  కేటీఆర్‌ అన్నట్లు దొంగ ఏడుపులు మాకు అవసరం లేదు. సినీ పరిశ్రమలో చాలా మంది విడాకులకు కేటీఆరే కారణం. ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నారు. నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆరే కారణం. ఎన్‌ కన్వెన్షన్‌ విషయంలోనే ఇది జరిగింది. అలాగే.. మరో హీరోయిన్‌ రకుల్‌ త్వరగా వివాహం చేసుకోవడానికి కూడా కేటీఆర్‌ వైఖరే కారణం. 

ఇదీ చదవండి: అక్కా దొంగ ఏడుపులు ఎందుకు: కేటీఆర్‌ 

విచారణలో కేటీఆర్ గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. మహిళలంటే కేటీఆర్‌కు చిన్నచూపు. ఆయన తీరుతో సినీ పరిశ్రమలో కొంతమంది ఇబ్బంది పడ్డారు.  హీరోయిన్స్ కి కేటీఆర్‌ డ్రగ్స్‌ అలవాటు చేశారు. కొందరు హీరోయిన్లు సినిమా ఫీల్డ్‌ నుంచి తప్పుకొంటే.. మరికొందరు త్వరగా పెళ్లి చేసుకున్నారు. 

.. దుబాయ్ నుండి సోషల్ మీడియా ను అపరేట్ చేయమని కేటీఆర్ కొందర్ని పురమాయించాడు. అక్కడి నుంచి బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా నడుస్తోంది. అక్కడి నుంచే నాపై పోస్టులు పెడుతున్నారు. మొన్న ఇద్దరిని, ఈరోజు ఇద్దరిని కేటీఆర్ దుబాయికి పంపించాడు’’ అని సురేఖ ఆరోపించారు. 

ఇక తనపై సోషల్‌ మీడియాలో జరిగిన ట్రోలింగ్‌ మీద మాజీ మంత్రి హరీశ్‌రావు మనసున్న మనిషిలా స్పందించారని, కేటీఆర్‌ మాత్రం స్పందించకపోగా.. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారని కొండా సురేఖ ఫైర్‌ అయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement