
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి కొండా సురేఖపై ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ప్రకాశ్ రాజ్.. ఏంటీ సిగ్గులేని రాజకీయాలు.. సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూపా?.. జస్ట్ ఆస్కింగ్ అంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ.. సినీ నటులు గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
ఏంటీ సిగ్గులేని రాజకీయాలు… సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే చిన్న చూప ?.. #justasking https://t.co/MsqIhDpbXa
— Prakash Raj (@prakashraaj) October 2, 2024
అంతకుముందు కేటీఆర్‌పై మంత్రి కొండా సురేఖ సంచలన ఆరోపణలు చేశారు. సినీ పరిశ్రమలో చాలా మంది విడాకులకు కేటీఆరే కారణం. ఎంతో మంది జీవితాలతో ఆడుకున్నారు. నాగచైతన్య సమంత విడాకులకు కేటీఆరే కారణం. ఎన్ కన్వెన్షన్ విషయంలోనే ఇది జరిగింది. అలాగే.. మరో హీరోయిన్ రకుల్ త్వరగా వివాహం చేసుకోవడానికి కూడా కేటీఆర్ వైఖరే కారణం. విచారణలో కేటీఆర్ గురించి షాకింగ్ విషయాలు తెలిశాయి. మహిళలంటే కేటీఆర్‌కు చిన్నచూపు. హీరోయిన్స్ కి కేటీఆర్ డ్రగ్స్ అలవాటు చేశారు. దుబాయ్ నుండి సోషల్ మీడియాను అపరేట్ చేయమని కేటీఆర్ కొందర్ని పురమాయించాడు. అక్కడి నుంచి బీఆర్‌ఎస్ సోషల్ మీడియా నడుస్తోంది. అక్కడి నుంచే నాపై పోస్టులు పెడుతున్నారు. మొన్న ఇద్దరిని, ఈరోజు ఇద్దరిని కేటీఆర్ దుబాయికి పంపించాడు అని ఆరోపించారు.
ఇది కూడా చదవండి: ‘అక్కా..దొంగ ఏడుపులు ఎందుకు?’.. మంత్రులపై కేటీఆర్ సెటైర్లు
Comments
Please login to add a commentAdd a comment