
సంక్రాంతికి షురూ!
దర్శకుడు విక్రమ్ కుమార్ కొత్త పెళ్లి కొడుకు... అక్కినేని అఖిల్ కాబోయే పెళ్లి కొడుకు.. ఇద్దరూ వ్యక్తిగత జీవితాలలో ఫుల్‌జోష్‌లో ఉన్నారు. ఇప్పుడు అదే జోష్‌లో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. విక్రమ్‌కుమార్ దర్శకత్వం వహిం చిన ‘మనం’లో అఖిల్ జస్ట్ ఇలా కనిపించి, అలా మార్కులు కొట్టేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు హీరోగా అఖిల్‌ను ఇంకా బాగా ప్రెజెంట్ చేయడానికి విక్రమ్ రెడీ అవుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 14న ఈ చిత్రం మొదలవుతుందట. అన్న పూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై నాగా ర్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.