డిసెంబర్‌లో వస్తాడు
డిసెంబర్ అంటే నాగార్జునకు ఎంతో ఇష్టం. ఎందుకంటే... ఆ నెలలో రిలీజైన ఆయన సినిమాలన్నీ దాదాపు హిట్టే! ఆ సెంటిమెంట్ ఏమో.. అఖిల్ హీరోగా నటిస్తున్న రెండో సినిమాను కూడా అదే నెలలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
అఖిల్ హీరోగా ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్‌పై నిర్మిస్తున్న సినిమాను డిసెంబర్ 22న రిలీజ్ చేయాలనుకుంటున్నట్టు తెలిపారు. ‘‘సినిమాలో చిన్న బిట్ చూశా. విక్రమ్, వినోద్ (సినిమాటోగ్రాఫర్, ‘మనం’కి కూడా వర్క్ చేశారు) మళ్లీ మేజిక్ రిపీట్ చేస్తారు’’ అని నాగార్జున పేర్కొన్నారు.