మనం రీమేక్లో మమ్ముట్టి | Mammootty family doing in Manam remake in Malayalam | Sakshi
Sakshi News home page

మనం రీమేక్లో మమ్ముట్టి

Published Thu, Dec 29 2016 11:24 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

మనం రీమేక్లో మమ్ముట్టి - Sakshi

మనం రీమేక్లో మమ్ముట్టి

మహానటుడు నాగేశ్వరరావు చివరి సినిమాగా భారీ క్రేజ్ సొంతం చేసుకున్న మూవీ మనం. అక్కినేని కుటుంబ హీరోలు నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్యలు కలిసి నటించిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. మూడు తరాల హీరోల కథతో తెరకెక్కిన ఈ మూవీని రీమేక్ చేసేందుకు చాలా మంది స్టార్లుప్రయత్నించారు. ముఖ్యంగా తమిళ స్టార్ హీరో సూర్య మనం రీమేక్ చేద్దామని ప్లాన్ చేసినా వర్క్ అవుట్ కాలేదు.

తాజాగా మరో సూపర్ స్టార్ ఈ సినిమాను రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో మనంను రీమేక్ చేయనున్నారు. నాగార్జున నటించిన పాత్రలో మమ్ముట్టి, నాగచైతన్య పాత్రలో దుల్కర్ సల్మాన్లు నటించే అవకాశం ఉంది. ఇక నాగేశ్వరరావు కనిపించిన పాత్రలో మలయాళ సీనియర్ నటుడు మదు కనిపించనున్నారు. ఇక హీరోయిన్లుగా నిత్యామీనన్, మమతా మోహన్దాస్లు నటించే అవకాశం ఉంది. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ సినిమాపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement