డా.అక్కినేని నాగేశర్వరావు 90వ పుట్టినరోజును పురస్కరించుకుని నిర్మాత, ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున 'మనం' చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేశారు. తన తండ్రి అక్కినేనితో, తనయుడు నాగచైతన్యతో కలిసి నటిస్తుండటం కొత్త అనుభూతిని అందిస్తోందని, తమ సంస్థలోనే ఇదొక మెమరబుల్ మూవీ అని నాగార్జున అన్నారు. ఫేస్ బుక్ లో అన్నపూర్ణ స్టూడియోస్ పేరుతో ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
మనం' చిత్రానికి ‘ఇష్క్' ఫేం విక్రమ్‌కుమార్ దర్శకుడు. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో అక్కినేని నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాత, తనయుడు, మనవడు... ఒకేసారి తెరపై సాక్షాత్కరించడం అటు అక్కినేని అభిమానులకే కాక, సగటు ప్రేక్షకులకు కూడా కనుల పండుగ కానుంది.