హ్యాట్రిక్ కొట్టేలాగే ఉన్నాడు..! | nagarjuna Hatrick plans with oopiri | Sakshi
Sakshi News home page

హ్యాట్రిక్ కొట్టేలాగే ఉన్నాడు..!

Published Sun, Feb 21 2016 11:12 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

హ్యాట్రిక్ కొట్టేలాగే ఉన్నాడు..! - Sakshi

హ్యాట్రిక్ కొట్టేలాగే ఉన్నాడు..!

యంగ్ హీరోలు కూడా సక్సెస్ కోసం కష్టపడుతుంటే సీనియర్ హీరో నాగార్జున మాత్రం భారీ సక్సెస్లతో దూసుకుపోతున్నాడు. మనం, సోగ్గాడే చిన్నినాయనా సినిమాలతో మంచి విజయాలు సాధిచిన టాలీవుడ్ మన్మథుడు ఇప్పుడు హ్యాట్రిక్ మీద కన్నేశాడు. మరోసారి ప్రయోగాత్మక చిత్రంతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్న కింగ్ మరో సక్సెస్ గ్యారెంటీ అన్న నమ్మకంతో ఉన్నాడు.

సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో 50 కోట్ల క్లబ్లో చేరిన తొలి సీనియర్ హీరోగా రికార్డ్ సృష్టించాడు నాగార్జున.. ఇప్పుడు అదే జోష్లో ఊపిరి సినిమాతో మరో భారీ సక్సెస్ మీద కన్నేశాడు. ఫ్రెంచ్ సినిమా ద ఇంటచబుల్స్ రీమేక్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తమిళ స్టార్ హీరో కార్తీతో కలిసి నటిస్తున్నాడు నాగ్. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతున్న ఊపిరి మార్చ్ 25న రిలీజ్కు రెడీ అవుతోంది.

ఈ సినిమాలో నాగ్ పూర్తిగా వీల్ చైర్కే పరిమితమయ్యే పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ఫ్రెష్ లుక్తో ఆకట్టుకుంటోంది. ముఖ్యంగా నాగ్ మరోసారి తన మార్క్ పర్ఫామెన్స్తో అలరించగా, కార్తీ ఎనర్జీ మరింత ప్లస్ అయ్యింది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుండటం కూడా సినిమా బిజినెస్కు ప్లస్ అవుతుందటున్నారు విశ్లేషకులు. అంతేకాదు ఊపిరితో నాగ్కు హ్యట్రిక్ కన్ఫామ్ అన్న నమ్మకంతో ఉన్నారు ఫ్యాన్స్.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement