వెంకీ కాదన్న కథలో నాగ్ | Nagarjuna accepted venkatesh denied script | Sakshi
Sakshi News home page

వెంకీ కాదన్న కథలో నాగ్

Published Wed, Oct 7 2015 3:00 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

వెంకీ కాదన్న కథలో నాగ్ - Sakshi

వెంకీ కాదన్న కథలో నాగ్

సీనియర్ హీరోలందరూ నెమ్మదిగా సినిమాలు చేస్తుంటే, మన్మథుడు నాగార్జున మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం 'సోగ్గాడే చిన్ని నాయనా', 'ఊపిరి' సినిమాల్లో నటిస్తున్న నాగ్, తను తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడు.

ఇప్పటికే 'సొగ్గాడే చిన్ని నాయనా' షూటింగ్ పూర్తి కావటంతో నాగ్ డబ్బింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దీంతో పాటు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కార్తీతో కలిసి చేస్తున్న బైలింగ్యువల్ సినిమా 'ఊపిరి' షూటింగ్ లోనూ పాల్గొంటున్నాడు. అంతేకాదు ఈ గ్యాప్ లోనే 'మీలో ఎవరు కోటీశ్వరుడు' సీజన్ 3 షూటింగ్ కూడా మొదలు పెట్టాలని భావిస్తున్నాడు.

ఇలా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్ననాగ్, తను తరువాత చేయబోయే సినిమాను కూడా ఫైనల్ చేశాడు. 'ఓనమాలు', 'మళ్లీ మళ్లీ ఇది రానీ రోజు' సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న క్రాంతి మాధవ్ దర్శకత్వంలో నాగ్ ఓ సినిమా చేయనున్నాడు. తొలుత ఈ సినిమాలో వెంకీ హీరోగా నటిస్తున్నాడని అఫీషియల్ ఎనౌన్స్మెంట్ కూడా వచ్చింది. చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ నుంచి వెంకీ తప్పుకోవటంతో... దర్శకుడు నాగార్జునను కలిశాడు. ఈ చిత్రంలో నటించేందుకు నాగ్ సుముఖత వ్యక్తం చేయటంతో త్వరలోనే ఈప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement