‘మనం' ఫస్ట్ లుక్ విడుదల | Akkineni Family multistarrer 'Manam' first look released | Sakshi
Sakshi News home page

‘మనం' ఫస్ట్ లుక్ విడుదల

Published Thu, Sep 19 2013 5:32 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

‘మనం' ఫస్ట్ లుక్ విడుదల - Sakshi

‘మనం' ఫస్ట్ లుక్ విడుదల

అక్కినేని కుటుంబంలోని మూడు తరాల హీరోలైన అక్కినేని నాగేశ్వరరావు, అక్కినేని నాగార్జున, అక్కినే నాగచైతన్య ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘మనం'. ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయింది. రేపు అక్కినేని నాగేశ్వరరావు  90వ జన్మదినం సందర్భంగా నిర్మాతలు దీన్ని విడుదల చేశారు.

నాగార్జున సూట్ నిల్చునుండగా, నాగ చైతన్య పంచకట్టుతో మధ్యలో కూర్చుని ఉన్నాడు. నట సామ్రాట్ నాగేశ్వరావు చిన్నపిల్లాడి డ్రెస్సులో మనవడి ముందు చేతులు కట్టుకుని ఉన్న ఈ ఫోటో చూడగానే ఆకట్టుకుంటోంది. ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ ఫోటోను ఫేస్ బుక్ లో ఉంచారు. మరోవైపు తన తండ్రికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ నాగార్జున ట్విట్ చేశారు. 'యంగ్ అండ్ హ్యేపీ బర్త్ డే నాన్న' అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement