సుధీర్ వర్మ దర్శకత్వంలో? | Sudhir Verma   Direction? | Sakshi
Sakshi News home page

సుధీర్ వర్మ దర్శకత్వంలో?

Published Wed, Mar 26 2014 11:50 PM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

సుధీర్ వర్మ  దర్శకత్వంలో? - Sakshi

సుధీర్ వర్మ దర్శకత్వంలో?

 ‘‘ఇక నుంచి ఏ సినిమా పడితే ఆ సినిమా చేయను. కథ మనసుకు నచ్చాలి. అది నన్ను డిమాండ్ చేయాలి. అలాంటి సినిమాలే చేస్తా’’ అని ఇటీవల పాత్రికేయుల సాక్షిగా చెప్పారు నాగార్జున. అందుకు తగ్గట్టే... అంగీకరించిన సినిమాలను సైతం పక్కన పెట్టేశారాయన. ‘మనం’ తర్వాత ఏ కథకూ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. నాగార్జున నుంచి సరైన సినిమా కోసం అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ‘స్వామి రారా’ చిత్రం దర్శకుడు సుధీర్‌వర్మ... నాగ్‌కు ఓ కథ వినిపించారట.

ఆ కథ ఆయనకు విపరీతంగా నచ్చేసిందని విశ్వసనీయ సమాచారం. తాను చేస్తేనే ఆ కథకు న్యాయం కలుగుతుందని నాగ్ భావించారట. వెంటనే సుధీర్‌వర్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. నాగార్జున లాంటి టాప్ స్టార్‌ని డెరైక్ట్ చేసే అవకాశం రెండో సినిమాకే సుధీర్‌వర్మకు దక్కిందనే వార్త సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుందని తెలిసింది. ఓ ప్రముఖ నిర్మాత నిర్మించే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement