sudhirvarma
-
కేశవ పరుగు
‘‘ప్రాణం కన్నా పగ, ప్రతీకారాలకు విలువ ఇస్తే ఏం జరుగుతుంది? రక్తంతో ఎరుపెక్కిన నదిలో పరుగులు తీస్తోన్న ఆ యువకుడి కథేంటి? తెలుసుకోవాలంటే కొన్ని రోజులు ఆగండి’’ అంటున్నారు దర్శకుడు సుధీర్‌వర్మ. నిఖిల్, రితూ వర్మ జంటగా ఆయన దర్శకత్వంలో అభిషేక్ నామా నిర్మిస్తున్న సినిమా ‘కేశవ’. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను ఇటీవల రిలీజ్ చేశారు. అభిషేక్ నామా మాట్లాడుతూ – ‘‘జనవరి 2 నుండి 10 వరకూ నరసాపురంలో జరిపే చిత్రీక రణతో సినిమా పూర్తవుతుంది. నిఖిల్, సుధీర్ వర్మ కలయికలో వచ్చిన ‘స్వామి రారా’లా ఈ సినిమా కూడా ట్రెండ్ సెట్టర్ అవుతుంది’’ అన్నారు. ఇషా కొప్పికర్, రావు రమేశ్, అజయ్, బ్రహ్మాజీ, ప్రియదర్శి నటిస్తున్న ఈ చిత్రానికి అర్ట్: రఘు కులకర్ణి, కెమేరా: దివాకర్ మణి, సంగీతం: సన్నీ యం.ఆర్., సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, సమర్పణ: దేవాన్ష్ నామా. -
నా తదుపరి సినిమా స్వామిరారా దర్శకుడితో..
పాత పోస్టాఫీసు/తుమ్మపాల: ఎక్కడికిపోతావు చిన్నవాడా చిత్ర యూనిట్ గురువారం నగరంతోపాటు అనకాపల్లిలో సందడి చేసింది. ఈ సందర్భంగా సినిమా కథానాయకుడు నిఖిల్ మాట్లాడుతూ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన సమయంలో కూడా చిత్రాన్ని సూపర్‌డూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. నా తదుపరి సినిమా స్వామిరారా చిత్ర దర్శకుడు సుధీర్‌వర్మతో చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ నగరంలో పేరుమోసిన జగదాంబ థియేటర్లో తన సినిమా ఎప్పటికై నా రిలీజ్ అవ్వాలన్న చిరకాల కోరిక ఈ విధంగా తీరిందని ఆనందం వ్యక్తం చేశారు. సినిమాలో నటన బాగుందని మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఫోన్‌చేసి అభినందించారని తెలిపారు. సినిమా విడుదలైన ప్రతీ సెంటర్‌ను సందర్శించి ప్రేక్షకులతో ఆనందం పంచుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా అనకాపల్లిలోని రామచంద్ర థియేటర్‌కు వచ్చిన సినిమా హీరో నిఖిల్‌తో పాటు చిత్ర యూనిట్ ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తింది. హీరోరుున్ నందితశ్వేత పలు డైలాగ్‌లతో యువతను ఉర్రూతలూగించారు. హీరోరుున్ నందితశ్వేత అందరికీ ఒక్కసారిగా హాయ్ చెప్పడంతో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. చిత్రంలో ఒక సన్నివేశాన్ని పలుకుతూ నేను అమల అని అనడంతో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ప్రేక్షకుల అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కేరళలో జరిగిన షూటింగ్లో అడవిలో ఒక చెట్టును చూసి భయపడినట్లు తెలిపారు. -
సుధీర్ వర్మ దర్శకత్వంలో?
‘‘ఇక నుంచి ఏ సినిమా పడితే ఆ సినిమా చేయను. కథ మనసుకు నచ్చాలి. అది నన్ను డిమాండ్ చేయాలి. అలాంటి సినిమాలే చేస్తా’’ అని ఇటీవల పాత్రికేయుల సాక్షిగా చెప్పారు నాగార్జున. అందుకు తగ్గట్టే... అంగీకరించిన సినిమాలను సైతం పక్కన పెట్టేశారాయన. ‘మనం’ తర్వాత ఏ కథకూ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వలేదు. నాగార్జున నుంచి సరైన సినిమా కోసం అభిమానులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. ‘స్వామి రారా’ చిత్రం దర్శకుడు సుధీర్‌వర్మ... నాగ్‌కు ఓ కథ వినిపించారట. ఆ కథ ఆయనకు విపరీతంగా నచ్చేసిందని విశ్వసనీయ సమాచారం. తాను చేస్తేనే ఆ కథకు న్యాయం కలుగుతుందని నాగ్ భావించారట. వెంటనే సుధీర్‌వర్మకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. నాగార్జున లాంటి టాప్ స్టార్‌ని డెరైక్ట్ చేసే అవకాశం రెండో సినిమాకే సుధీర్‌వర్మకు దక్కిందనే వార్త సినీవర్గాల్లో చర్చనీయాంశమైంది. త్వరలోనే ఈ సినిమా సెట్స్‌కి వెళ్లనుందని తెలిసింది. ఓ ప్రముఖ నిర్మాత నిర్మించే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.