నా తదుపరి సినిమా స్వామిరారా దర్శకుడితో..
పాత పోస్టాఫీసు/తుమ్మపాల: ఎక్కడికిపోతావు చిన్నవాడా చిత్ర యూనిట్ గురువారం నగరంతోపాటు అనకాపల్లిలో సందడి చేసింది. ఈ సందర్భంగా సినిమా కథానాయకుడు నిఖిల్ మాట్లాడుతూ ప్రభుత్వం పెద్దనోట్లను రద్దు చేసిన సమయంలో కూడా చిత్రాన్ని సూపర్‌డూపర్ హిట్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. నా తదుపరి సినిమా స్వామిరారా చిత్ర దర్శకుడు సుధీర్‌వర్మతో చేస్తున్నట్లు వెల్లడించారు. విశాఖ నగరంలో పేరుమోసిన జగదాంబ థియేటర్‌లో తన సినిమా ఎప్పటికై నా రిలీజ్ అవ్వాలన్న చిరకాల కోరిక ఈ విధంగా తీరిందని ఆనందం వ్యక్తం చేశారు.
సినిమాలో నటన బాగుందని మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున ఫోన్‌చేసి అభినందించారని తెలిపారు. సినిమా విడుదలైన ప్రతీ సెంటర్‌ను సందర్శించి ప్రేక్షకులతో ఆనందం పంచుకుంటున్నామని తెలిపారు. అదేవిధంగా అనకాపల్లిలోని రామచంద్ర థియేటర్‌కు వచ్చిన సినిమా హీరో నిఖిల్‌తో పాటు చిత్ర యూనిట్ ప్రేక్షకులను ఆనందంలో ముంచెత్తింది. హీరోరుున్ నందితశ్వేత పలు డైలాగ్‌లతో యువతను ఉర్రూతలూగించారు. హీరోరుున్ నందితశ్వేత అందరికీ ఒక్కసారిగా హాయ్ చెప్పడంతో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. చిత్రంలో ఒక సన్నివేశాన్ని పలుకుతూ నేను అమల అని అనడంతో ప్రేక్షకులు కేరింతలు కొట్టారు. ప్రేక్షకుల అడిగిన ప్రశ్నకు బదులిస్తూ కేరళలో జరిగిన షూటింగ్‌లో అడవిలో ఒక చెట్టును చూసి భయపడినట్లు తెలిపారు.