మళ్లీ కెమెరా ముందుకి వస్తున్న అక్కినేని
దాదాపు రెండేళ్ల తర్వాత మళ్లీ మహానటుడు అక్కినేని ముఖానికి రంగేసుకున్నారు. ఆయన కుటుంబానికి చెందిన మూడు తరాలు కలిసి ‘మనం’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.
నాగార్జున, నాగచైతన్యలపై ఇప్పటికే దర్శకుడు విక్రమ్‌కుమార్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సోమవారంతో ఏఎన్నార్ వంతు వచ్చింది.
దాంతో రెండేళ్ల విరామం తర్వాత మేకప్ వేసుకొని హుషారుగా అడుగులేస్తూ కెమెరా ముందుకెళ్లారు ఏఎన్నార్. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆయన మనవడు సుమంత్ తెలిపారు. సుమంత్ ప్రస్తుతం ‘ఏమో గుర్రం ఎగురావచ్చు’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.