నేను జీవితాంతం గుర్తు పెట్టుకోవడానికి అవి చాలు | I remember getting to the end of life | Sakshi
Sakshi News home page

నేను జీవితాంతం గుర్తు పెట్టుకోవడానికి అవి చాలు

Published Thu, May 22 2014 11:24 PM | Last Updated on Sun, Jul 21 2019 4:48 PM

నేను జీవితాంతం గుర్తు పెట్టుకోవడానికి అవి చాలు - Sakshi

నేను జీవితాంతం గుర్తు పెట్టుకోవడానికి అవి చాలు

లక్కీ గాళ్ ఆఫ్ టాలీవుడ్ అంటే సమంతానే. ఆమె నటించిన తెలుగు సినిమాలన్నీ ఎక్కువ శాతం హిట్లే. గ్లామర్‌తో పాటు అభినయానికీ ప్రాధాన్యమిచ్చే సమంత ‘మనం’లో రెండు రకాల పాత్రలు పోషించారు. అక్కినేని త్రయం హీరోలుగా విక్రమ్‌కుమార్ దర్శకత్వంలో అక్కినేని కుటుంబం నిర్మించిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విలేకరులతో సమంత ప్రత్యేకంగా ముచ్చటించారు.
 
నిజంగా నా అదృష్టం: అక్కినేని కుటుంబం నటించిన ఈ లెజెండ్రీ మూవీలో నాకూ స్థానం దొరకడం నిజంగా అదృష్టం. అయితే... వాళ్లు కాకుండా ఎవరు చేసినా... ఈ సినిమాను మాత్రం వదులుకునేదాన్ని కాదు. ఇందులో రెండు రకాల పాత్రల్లో కనిపిస్తాన్నేను. వాటిలో ఒక పాత్ర పేరు ‘కృష్ణ’. తల్లి పాత్ర. నా కెరీర్‌లో వయసుకు మించిన పాత్ర చేయడం ఇదే. రెండో పాత్ర పేరు ‘ప్రియ’. జోవియల్‌గా అల్లరి చేస్తూ ఉండే పాత్ర. నిజంగా ఈ రెండు పాత్రలు నాకు ఛాలెంజ్. అలాగే... ఇందులో శ్రీయ కూడా ఓ కథానాయిక. గొప్పగా నటించింది తను. చైతూ, నేను కలిసి నటించిన మూడో సినిమా ఇది. ఇందులో మా జంట యువతను బాగా ఆకట్టుకుంటుంది. ఇందులో ‘నాగేశ్వర్’ ఎవరు? అని అందరూ అడుగుతున్నారు. తనెవరో తెరపై చూస్తేనే మజాగా ఉంటుంది.
 
అక్కినేనిగారి విజువల్స్ చూస్తాను: అక్కినేనిగారి కాంబినేషన్‌లో నావి రెండు మూడు సీన్లే. నేను జీవితాంతం గుర్తు పెట్టుకోవడానికి అవి చాలు. ఆయన సెట్‌లో ఉంటే సమయమే తెలిసేది కాదు. ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండేవారు. ఆయన ఈ రోజు మన మధ్య లేకపోవడం బాధగా ఉంది. ‘ఏమాయ చేశావె’ టైమ్ నుంచి ఆయనతో నాకు మంచి పరిచయం ఉంది. ఆర్టిస్ట్‌గా నాకందిన తొలి ప్రశంస ఆయనదే. ఇప్పటికీ... ‘నేను సరైన రంగంలోనే ఉన్నానా. నటిగా నేను కరెక్టేనా’ అనిపించినప్పుడు ‘ఏ మాయచేశావె’ సక్సెస్‌మీట్‌లో అక్కినేనిగారు నా గురించి మాట్లాడిన విజువల్స్ చూస్తాను.అంతే... నాలో ఉన్న ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ ఎగిరిపోతుంది. అక్కినేనిగారితో పాటు నాగార్జునగారితో కూడా కలిసి చేసే అవకాశం ఈ సినిమా పుణ్యమా అని నాకు దక్కింది.

అభినయానికే తొలి ప్రాధాన్యం: నేను మొదట్నుంచీ గ్లామర్‌కి పెద్ద ప్రాధాన్యత ఇవ్వలేదు. తెలుగులో నా తొలి సినిమా ‘ఏమాయ చేశావె’లో కూడా నాది గ్లామర్ పాత్ర కాదు. నా అదృష్టమో ఏమో తెలీదు కానీ... నేను కమర్షియల్ సినిమాలు ఎన్ని చేసినా, ఏడాదికి ఒకటైనా సరే... అభినయానికి ఆస్కారమున్న సినిమా నాకు దక్కింది. ఏమాయ చేశావె, ఈగ, ఇప్పుడు ‘మనం’. ఇక నుంచి కూడా అభినయానికే తొలి ప్రాధాన్యం ఇస్తాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement