'మనం'ను అక్కినేని చూడకపోవడం విషాదకరం:వర్మ
అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం 'మనం'పై ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ ప్రశంసలు కురిపించారు. బాలీవుడ్ లో ఈ చిత్రం విడుదలై ఉంటే సులభంగా వంద కోట్ల రూపాయలు వసూలు చేసేందని వర్మ సోషల్ మీడియాలో ట్వీట్ చేశారు.
ఏఎన్నాఆర్ తో తొలిసారి నాగార్జున నటించేటప్పడు తడబాటుకు గురయ్యాడు. అయితే నాగ చైతన్య విషయంలో అలాంటి జరగలేదని.. నాగార్జున కంటే నాగచైతన్యనే బెటర్ గా యాక్ట్ చేశారని వర్మ ట్వీట్ చేశారు.
అయితే 'మనం' చిత్రాన్ని ఏఎన్నాఆర్ చూడలేకపోవడం అత్యంత విషాదకరమని వర్మ వ్యాఖ్యలు చేశారు. విక్రమ్ కుమార్ దర్శకత్వం వహించిన 'మనం' చిత్రంలో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ తోపాటు అమల, అమితాబ్ బచ్చన్ లు నటించారు.