
ఓ తీపి జ్ఞాపకం...
‘‘చివరి క్షణం వరకూ నటునిగానే కొనసాగాలన్న నాన్నగారి ఆశకు ప్రతిరూపమే ‘మనం’ సినిమా’’ అని నాగార్జున చెప్పారు. అక్కినేని కుటుంబం నిర్మించిన చిత్రం ‘మనం’. మహానటుడు స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలిసి నటించిన ఈ చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ -‘‘నాన్నగారి చివరి సినిమా ‘మనం’ జనహృదయాల్లో కలకాలం గుర్తుండిపోతుంది. అనూప్ స్వరపరిచిన పాటలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ చిత్రం నాకో తీపి జ్ఞాపకం’’ అన్నారు. శ్రీయ, సమంత కథానాయికలుగా నటించిన ఈ చిత్రానికి మాటలు: హర్షవర్ధన్, కెమెరా: పి.ఎస్.వినోద్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: సుప్రియ, సమర్పణ: అక్కినేని అన్నపూర్ణ, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్.