
సాక్షి, హైదరాబాద్: టాలీవుడ్ సినీ వినీలాకాశంలో ధృవతారలా వెలిగిన నటుడు అక్కినేని నాగేశ్వరరావు. యావత్‌ప్రపంచం గర్వపడేలా అగ్రకథానాయకుడిగా విరాజిల్లిన కళామతల్లి ముద్దుబిడ్డ ఏఎన్‌ఆర్. దేవదాసు అయినా, కాళిదాసు అయినా, అమర ప్రేమికుడైనా ఆయనొక లెజెండ్. అందుకే అనేక అవార్డులు ఆయనకు సలాం చేశాయి. 75 వసంతాలకు పైగా వెండి తెరను సుపంపన్నం చేసిన ఎఎన్‌ఆర్ జయంతి ఈ రోజు.
ఈ సందర్భంగా ఆయన నటవారడు టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున తన తండ్రికి ట్విటర్ ద్వారానివాళులర్పించారు. ఆయనే తన హీరో, స్పూర్తి అంటూ ఒక వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. ఆయనకు పంచె అంటే ఎంతో ఇష్టమని, ముఖ్యంగా పొందూరు ఖద్దరుఅంటే ఎంతో ఇష్టమని పేర్కొన్నారు. ఆయన పంచె కట్టు అందాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకే అంటూ తన అప్‌కమింగ్ మూవీ బంగార్రాజు లుక్‌ను జోడించారు.
కాగా నాగార్జున 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాకు సీక్వల్‌గా 'బంగార్రాజు' సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ సినిమాలో నాగార్జునతో పాటు యంగ్ హీరో నాగ చైతన్య కూడా అలరించనున్నారు. నాగ్‌కు జోడీగా రమ్యకృష్ణ, నాగ చైతన్య సరసన ఉప్పెన ఫేం బ్యూటీ కృతి శెట్టి నటిస్తోంది
Remembering dear Nana! My hero!! My inspiration!! #ANRLivesOn pic.twitter.com/CgHKCLwObY
— Nagarjuna Akkineni (@iamnagarjuna) September 20, 2021