నాగ్ కొత్త సినిమాలో ఏఎన్నార్ గెస్ట్ రోల్..? | Akkineni Nageswara rao special role in Nagarjuna Om namovenkateshaya | Sakshi
Sakshi News home page

నాగ్ కొత్త సినిమాలో ఏఎన్నార్ గెస్ట్ రోల్..?

Published Tue, Sep 27 2016 11:09 AM | Last Updated on Mon, Jul 15 2019 9:21 PM

నాగ్ కొత్త సినిమాలో ఏఎన్నార్ గెస్ట్ రోల్..? - Sakshi

నాగ్ కొత్త సినిమాలో ఏఎన్నార్ గెస్ట్ రోల్..?

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న భక్తిరస చిత్రం ఓం నమో వేంకటేశాయలో అతిథి పాత్రలో కనిపించనున్నారు. చనిపోయి చాలా కాలం అవుతున్నా.. ఏఎన్నార్ సినిమాలో ఎలా నటిస్తారని ఆలోచిస్తున్నారా..? ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏఎన్నార్ను మరోసారి వెండితెర మీద చూపించేందుకు రెడీ అవుతున్నారు అక్కినేని టీం.

గ్రాఫిక్స్ సహాయంతో రూపొందించనున్న నాగేశ్వరరావు పాత్ర దాదాపు మూడు నిమిషాల పాటు కనిపించనుందట. ప్రస్తుతం కన్నడలో తెరకెక్కిన నాగభరణం సినిమాలో కూడా చనిపోయిన విష్ణువర్థన్ హీరోగా కనిపిస్తున్నారు. అదే తరహాలో ఓం నమోవేంకటేశాయలో ఏఎన్నార్ కనిపించనున్నారు. ఇప్పటి వరకు యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించకపోయినా అక్కినేని అభిమానులు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement