హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రముఖ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మృతికి సంతాపంగా గురువారం షూటింగ్‌లన్నీ బంద్ పాటిస్తున్నట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మురళీమోహన్ వెల్లడించారు. అలాగే సినిమా థియేటర్లు కూడా బంద్ పాటించాలని కోరారు. షూటింగ్‌లు, థియేటర్లు బంద్ పాటించాలన్న నిర్ణయాన్ని అన్ని కార్మిక సంఘాలకు తెలియజేశామన్నారు. అలాగే గురువారం రాష్ట్రంలో అన్ని టెలివిజన్ షూటింగ్‌లకూ సెలవు ప్రకటిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ టెలివిజన్ టెక్నీషియన్స్ అండ్ డిజిటల్ సినీ వర్కర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు డి.సురేష్‌కుమార్ తెలిపారు.
అక్కినేని మరణవార్తతో బుధవారం సినీ కార్యాలయాలు మూతపడ్డాయి. మద్రాసు నుంచి తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్‌కు తరలి వచ్చినప్పుడు అక్కినేనికి చెందిన అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లోనే 24 క్రాఫ్ట్‌ల కార్యాలయాలు వెలిశాయి. సినీ కార్మికుల నివాసాలతో పాటు సినీ అనుబంధ కార్యాలయాలూ ఇక్కడే ఏర్పాటయ్యాయి. వివిధ సినీ యూనియన్లతో పాటు వీటన్నింటికీ అనుబంధమైన ఫిలిం ఫెడరేషన్ కార్యాలయం కూడా అన్నపూర్ణ స్టూడియో వద్దే ఏర్పాటైంది. అక్కినేని మృతితో ఆయా కార్యాలయాలన్నీ బోసిపోయాయి. అక్కినేనికి సినీ పరిశ్రమకు చెందిన వివిధ విభాగాల వారంతా నివాళులర్పించారు.
నేడు థియేటర్లు, షూటింగ్‌లు బంద్
Published Thu, Jan 23 2014 1:42 AM | Last Updated on Tue, Oct 2 2018 3:08 PM
Advertisement
Advertisement