
ఏఎన్నార్ గొప్ప మానవతా వాది
నటసామ్రాట్ డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ మరో ధృవ తారను కోల్పోయిందని తెలుగు అసోషియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) పేర్కొంది. ఏఎన్నార్ అద్బుతమైన నటుడని కీర్తించింది. అంతేకాకుండా అంతకు మించిన మంచి మానవతావాది అని తెలిపింది. ఆ మహానటుడి నటన, జీవితం ఎందరికో ఆదర్శప్రాయమని వెల్లడించింది. దాదాపు 75 ఏళ్లకు పైగా పలు చిత్రాలలో నటిస్తునే ఉన్నారని చెప్పింది.
ఏఎన్నార్ నటించిన చిత్రాలు ప్రపంచ ప్రేక్షకుల మదిని రంజింప చేశాయని తెలిపింది. ఆ మహానటుడి నటనాచాతుర్యం ఆమోఘమని అభివర్ణించింది. అక్కినేనితో తమ సంస్థకు గల అనుబంధాన్ని తానా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది. అందులోభాగంగా 2012లతో జీవిత కాల సాఫల్య పురస్కారంతో తమ సంస్థ అక్కినేనిని గౌరవించిన సంగతిని తానా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంది.