'ఆయన మై ఫెవరేట్ హీరో....' | My favourite hero Akkineni Nageswara rao, says Veteran actress saroja devi | Sakshi
Sakshi News home page

'ఆయన మై ఫెవరేట్ హీరో....'

Published Thu, Feb 20 2014 8:47 AM | Last Updated on Wed, Apr 3 2019 9:15 PM

'ఆయన మై ఫెవరేట్ హీరో....' - Sakshi

'ఆయన మై ఫెవరేట్ హీరో....'

తిరుమల : అక్కినేని నాగేశ్వరరావుతో కలిసి నటించిన 'ఆత్మబలం'లోని చిటపట చినుకులు పడుతూ ఉంటే... పాట ఎన్నటికీ మరువలేనని అలనాటి సినీనటి సరోజాదేవి అన్నారు. బుధవారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం సరోజాదేవి మీడియాతో మాట్లాడుతూ 'ఆంధ్రాకు రాగానే నాగేశ్వరరావు గుర్తొచ్చారు. ఆయన మై ఫెవరేట్ హీరో. హాయ్ హీరోయిన్ ఎలా ఉన్నావ్ అని నాగేశ్వరరావు నన్ను అడిగేవారు' అని తన జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు.

అలాగే ఎన్టీ రామారావు కూడా తనను ఎంతగానో ప్రోత్సహించారని చెప్పారు. తెలుగులో నటించిన ప్రతి సినిమా హిట్ అయిందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. తనతోపాటు సినిమాల్లో నటించిన నటీనటులను మిస్సయ్యాను అనే ఫీలింగ్ వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తరువాత మనస్సుకు సంతృప్తిగా ఉందని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement