అక్కినేని అంచు పంచెలు... | Akkineni nageswara rao Evergreen Brand Ambassador Dhoti edge | Sakshi
Sakshi News home page

అక్కినేని అంచు పంచెలు...

Published Sun, Mar 13 2016 12:44 AM | Last Updated on Thu, May 24 2018 12:20 PM

అక్కినేని అంచు పంచెలు... - Sakshi

అక్కినేని అంచు పంచెలు...

పొందూరు ఖాదీకి ఎవర్‌గ్రీన్ బ్రాండ్ అంబాసిడర్ అంటే అక్కినేని నాగేశ్వరరావే. ఆకుపచ్చ, ఊదా, కెంపు రంగుల్లో అంచులు ఉండే పంచెలంటే అక్కినేనికి మహా ఇష్టం. ఈ తరహా పంచెలు అక్కినేని పంచెలు గానే స్థిరపడిపోయాయి. చనిపోయేంత వరకు ఏఎన్‌ఆర్ పొందూరు ఖాదీనే వాడారు. అక్కినేని స్వయంగా పంచెలకు అంచును డిజైన్ చేసి పొందూరుకు పంపించడంతో ఆ వస్త్రాలకు మంచి గిరాకీ వచ్చింది. ఏటా సుమారు రూ. 40 వేలు విలువ చేసే వస్త్రాలను ఆయన కొనుగోలు చేసేవారు. ఈ పంచెలను నేయడానికి పొందూరు ఫైన్(100వ కౌంట్) దారాన్ని వాడుతారు. అంచు సింగిల్ బోర్డర్ అంచు పంచె రూ.8వేలు నుంచి రూ. 9వేలు వరకు ధర పలుకుతోంది. ఏటా రూ 7 లక్షలు విలువ చేసే ఏఎన్‌ఆర్ అంచు పంచెలను ఇక్కడ ఉత్పత్తి చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement