మొన్నటి వరకు ఎవరైనా ఇన్‌షర్ట్ వేసుకుని బాగా ముస్తాబైతే ‘ఏమిరా నాగేశ్వర్‌రావులా తయారయ్యావు’ అని అంటుండేవారు. అక్కినేని వేసే స్టెప్పులు, డైలాగ్ డెలివరీ, హావభావాలు ఆనాటి తరం వారు బాగా అనుకరించే వారు. యువతులైతే నాగేశ్వర్‌రావు సినిమాలను చూసేందుకు ఇష్టపడేవారు. 90 ఏళ్ల వయసులోనూ ఆయన సినిమాల్లో నటిస్తున్నార ని తెలుసుకున్న అభిమానులు సంతోషించారు.
వారి ఫ్యామిలీ అంతా కలిసి నటించిన సినిమా కోసం ఎదురుచూస్తున్న తరుణంలో అక్కినేని మరణించారనే వార్త జిల్లా ప్రజానీకాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. బుధవారం ఉదయమే అక్కినేని మరణ వార్త తెలుసుకున్న అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆ మహానటుడు ఇకలేడా అని జీర్ణించుకోలేకపోతున్నారు. నట సామ్రాట్ అక్కినేని అస్తమయంతో సినీప్రియులు దుఃఖించారు. ఘన నివాళి అర్పించారు.
అక్కినేని కారణ జన్ముడు..
అక్కినేని నాగేశ్వర్‌రావు కారణ జన్ముడు. ఆయన జన్మించిన శతాబ్దం లో పుట్టడం నా అదృష్టం. నాగేశ్వర్‌రావు సినీ రంగానికి ఎంతో సేవ చేశారు. హైదరాబాద్‌కు సినీ పరిశ్ర మ రావడానికి నాగేశ్వర్‌రావు కారకుడు. చనిపోయే వరకు కూడా నటించాడు. మిస్సమ్మ, గుండమ్మకథ, ప్రేమ్‌నగర్, దేవదాసు, ప్రేమాభిషేకం సినిమాలు ఎస్సెట్. సినిమాలో నృత్యాలను తీసుకొచ్చిందీ ఆయ నే. మాలాంటి వారికి ఆయన డిక్షనరిలాంటి వారు. - పైడిపెల్లి వంశీ, ప్రముఖ సినిమా దర్శకుడు, మంచిర్యాల
గొప్ప నటుడాయన..
నాగేశ్వర్‌రావుతో అనుబంధం మరచిపోలేను. విజయవాడలో నాకు కళాకారుడిగా నాగేశ్వర్‌రావు చేతుల మీదుగా సన్మా నం జరగడం జీవితంలో మరచిపోలేని అనుభూతి. సుమంత్‌తో రణం సినిమా తీయడానికి నాగేశ్వర్‌రా వు ఇంటికి వెళ్లగా ఎంతో ఓపికతో కథ విన్నారు. దర్శకునిగా నన్ను ప్రోత్సహించారు. ఆయనకు వచ్చిన అవార్డులు, సినిమాలపై 45 నిడివి గల టీవీ డాక్యుమెంట్ తీశాను. కొత్త నటులను ప్రోత్సహించేంవారు. - దండనాయకుల సురేశ్‌కుమార్, టీవీ, చలన చిత్ర దర్శకుడు
అక్కినేని సినిమాలే బాగా ఆడేవి..
నాడు థియేటర్లలో అక్కినేని నాగేశ్వర్‌రావు సినిమా ప్రదర్శించామంటే ప్రేక్షకుల తాకిడి విపరీతంగా ఉండేది. మహిళాభిమానులు ఎక్కువ. లైలా మజ్ను, దసరాబుల్లోడు, పల్నా టి యుద్ధం, ముగ్గురు మరాఠీలు, దేవదాస్, ప్రమాభిషేకం సినిమాలు మా వసంత టాకీసులోనే ప్రదర్శించాం. విద్యుత్ అంతరాయం ఉన్నా ఓపికతో ఆ యన సినిమా చూసేవారు. ఉదయం ఆట టికెట్ దొరక్కపోతే మ్యాట్నీ షోకు లైన్‌లో ఉండే వారు. - ముస్త్యాల శంకరయ్య, సినిమా థియేటర్ యజమాని, మంచిర్యాల
ఆరు కిలోమీటర్లు నడిచే వారం..
మంచిర్యాల శివారులోని నస్పూర్ గ్రామం మాది. మంచిర్యాలలోనే వసంత టాకీస్ ఉంది. అందులో నాగేశ్వర్‌రావు సినిమా వేశారంటే మూడు కిలోమీటర్ల దూరం కాలినడకన కలిసి వెళ్లి చూసే వారం. అలా ఆరు కిలోమీటర్లు నడిచేవారం. ఆయనపై ఉన్న అభిమానంతో నడక ప్రయాస తెలి సేది కాదు. సినిమాల్లో అద్భుతంగా నటించేవారు. 90లోనూ నటించారంటే హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.
- పురుషోత్తంరావు, సినిమాహాలు మేనేజర్, మంచిర్యాల
నేటితరం నటులతోనూ పోటీ..
నాగేశ్వర్‌రావు లాంటి గొప్ప నటుడు మరొకరు లేరు. నాటి నుంచి నేటితరం నటుల వరకూ ఆయన పోటీ పడ్డారు. సీతారామయ్యగారి మనుమరాలు సినిమాలో ఆయన నటన తిరుగులేని ది. సినీ పరిశ్రమ పురోగతికి అంకురార్పణ చేశారు. ఈ తరం హీరోయిన్లతో కూడా స్టెప్పులేస్తానని ఓ ఆడియో ఫంక్షన్‌లో నాగేశ్వర్‌రావు చెప్పడం ఆయనలో ఉన్న ఉత్సాహానికి నిదర్శనం. ఆయన చివరి వరకు కూడా నటననే ప్రేమించాడు, నటించాడు. - ఈరేటి శ్రీనివాస్, వ్యాపారి, మంచిర్యాల
స్వశక్తిని నమ్మిన మనిషి..
ప్రేమ అనే పదానికి అక్కినేని మారుపేరు. ప్రేమాభిషేకం, దేవదాసు, గుండమ్మ కథలు చాలా గొప్ప చిత్రాలుగా పేరు సాధించాయి. స్వశక్తిని నమ్ముకుని ఎదిగిన వ్యక్తి ఆయన. సమాజ సేవలోనూ ముందుండే నిరాడంబర మనిషి అక్కినేని. గొప్పలు ఆశించకుండా, స్వార్థాలకు దూరంగా ఉంటూ ఎదిగారు. అక్కినేనిని నేటి నటులు ఆదర్శంగా తీసుకోవాలి. అటువంటి వ్యక్తులను స్మరించాలి. నేనూ ఆయన అభిమానినే. - మనోహర్, రిటైర్డ్, స్కూల్ అసిస్టెంట్
దసరా బుల్లోడు.. ఇక లేడని..
Published Thu, Jan 23 2014 8:37 AM | Last Updated on Thu, May 24 2018 12:20 PM
Advertisement
Advertisement