ప్రముఖ దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు నటించిన కొన్ని క్లాసిక్ చిత్రాలు మళ్లీ థియేటర్స్‌లో ప్రదర్శితం కానున్నాయి. ఈ ఏడాది సెప్టెంబరు 20న అక్కినేని నాగేశ్వరరావు నూరవ జయంతిని పురస్కరించుకుని ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ‘ఏయన్నార్ 100 – కింగ్ ఆఫ్ ది సిల్వర్‌స్క్రీన్’ పేరుతో ఓ ఫిల్మ్ ఫెస్టివల్‌ను ప్రకటించింది. హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు వంటి మెట్రో సిటీస్‌తో ΄ాటు వరంగల్, కాకినాడ, తుముకూరు, వడోదర, జలంధర్, రూర్కెలా సహా 25 నగరాల్లో సెప్టెంబర్ 20 నుంచి 22 వరకు 10 క్లాసిక్స్ చిత్రాలను ఈ ఫెస్టివల్‌లో ప్రదర్శించనున్నారు.
ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ– ‘‘మా నాన్నగారి 100వ జయంతిని దేశవ్యాప్తంగా ఆయన ల్యాండ్‌మార్క్ సినిమాల ఫెస్టివల్‌తో జరుపుకోనుండటం ఆనందంగా ఉంది. మన రాష్ట్రంలో తెలుగు చిత్ర పరిశ్రమకు తొలి పునాది వేసి అన్నపూర్ణ స్టూడియోస్‌ను స్థాపించి మార్గ దర్శకునిగా నిలిచారు. ఆయన లెగసీని కొనసాగించడం మాకు గర్వంగా వుంది.
ఈ పండగను సాధ్యం చేయడంలో మాతో భాగస్వామ్యం అయినందుకు అక్కినేని కుటుంబం మొత్తం ఎన్‌ఎఫ్‌డీసీ–ఎన్‌ఎఫ్‌ఎఐ, పీవీఆర్–ఐనాక్స్‌కి ధన్యవాదాలు’’ అని అన్నారు. ‘‘తెలుగు సినీ లెజెండ్ శ్రీ అక్కినేని నాగేశ్వరరావు గౌరవార్థం ఈ ఫెస్టివల్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు ఫిల్మ్ హెరిటేజ్ ఫౌండేషన్ ఫిల్మ్ మేకర్, డైరెక్టర్ శివేంద్ర సింగ్ దుంగార్‌పూర్. ‘‘ఒక దిగ్గజ నటుడికి నివాళులర్పించడం మాత్రమే కాదు, భారతీయ సినిమా యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, ప్రచారం చేయడానికే ఈ పండగ’’ అని తెలి΄ారు ఎన్‌ఎఫ్‌డీసీ–నేషనల్ ఫిల్మ్ ఆర్కైవ్ ఆఫ్ ఇండియా జాయింట్ సెక్రటరీ, మేనేజింగ్ డైరెక్టర్ పృథుల్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment