బతికి ఏం బావుకుంటామని చావబోకు
చచ్చి ఏం సాధిస్తామని బతకబోకు
బతికి జీవితాన్ని సాధించు
చనిపోయి కలకాలం జీవించు
- ‘అ.. ఆ’లులో అక్కినేని
నువ్వు ఏడిస్తే ఏడ్చాం.. నువ్వు నవ్వితే నవ్వాం.. నువ్వు ‘ప్రేమాభిషేకం’ అంటే మేం పట్టాభిషేకం చేశాం.. ‘చెంగావి రంగు చీర..’ అంటూ స్టెపులేస్తే నీ అడుగుల్లో అడుగులేశాం. ‘ఆగదు ఏ నిముషం నీకోసం..’ అంటూ కాలానికి భాష్యం చెబితే అర్ధం చేసుకున్నాం.. కానీ.. టాటా.. వీడుకోలు అంటూ మాకు దూరం అవుతుంటే మాత్రం తట్టుకోలేకపోతున్నాం.. అని జిల్లాలోని ఏఎన్‌ఆర్ అభిమానులు కంటతడి పెట్టుకుంటున్నారు. గుంటూరు జిల్లాతో ఆయనకున్న అనుబంధాన్ని, వచ్చిన సందర్భాలను గుర్తుచేసుకున్నారు.
ఆంధ్రాప్యారిస్‌లో అపూర్వ ఆహ్వానం
తెనాలిరూరల్, న్యూస్‌లైన్ : నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 60 సినివూలు పూర్తిచేసిన సందర్భంలో ఆంధ్రదేశంలోని అన్ని పట్టణాల్లో వజ్రోత్సవాలు నిర్వహించారు. నాగేశ్వరరావు రాష్ట్రమంతా పర్యటించారు. అదే సందర్భంలో 1957 జూలైలో తెనాలిలో నాగేశ్వరరావును సన్మానించేందుకు పట్టణంలోని నాటక సంస్థలన్నీ కమిటీగా ఏర్పడ్డాయి. ఆహ్వానసంఘ కమిటీకి అధ్యక్షుడిగా కల్లూరి కృష్ణమూర్తి, కార్యదర్శిగా నేతి పరమేశ్వరశర్మ, కోశాధికారిగా సత్యనారాయుణ టాకీస్ అధినేత వాసిరెడ్డి నారాయుణరావు, ఉపాధ్యక్షుడిగా చంద్రవళి సత్యనారాయుణ, ‘వూయులఫకీరు’ వల్లూరి వెంకట్రావుయ్యు వ్యవహరించి ఏఎన్‌ఆర్‌ను ఆహ్వానించారు. సత్కారంలో భాగంగా టాపులేని వాహనంలో అక్కినేనికి జరిగిన ఊరేగింపులో వేలాదిజనం పాల్గొన్నారు. వుుందుగానే అక్కినేని వస్తారని తెలిసినందున పరిసరాల్లోని గ్రావూల నుంచి ప్రజలు ఉదయూన్నే భోజనం వుూటలతో సహా తెనాలి చేరుకున్నారు. నాగేశ్వరరావుకు ఆరోజు నాగకళావుందిర్‌లో ఘనసన్మానం జరిగింది. పట్టణ కళాకారులతో ఆయున విడిగా తాలూకా హైస్కూలులో సవూవేశవుయ్యూరు. పట్టణ చరిత్రలో ఇదొక అద్భుతమైన సన్నివేశంగా ఇప్పటికీ చెప్పుకొంటారు. అక్కినేని సినిమాల్లో చేసిన క్యారెక్టర్లకూ, తన జీవితానికి సంబంధం ఉందని, ఆయన సినిమాల్లోని సంఘటనలు తన నిజజీవితంలో జరిగాయని తెనాలి మండలం కొలకలూరుకు చెందిన అభిమాని ‘మిఠాయి’ శివయ్య ఇప్పటికీ చెబుతుంటారు. ప్రతి సందర్భంలోనూ తన భార్యతో కలసి ఆయన హైదరాబాద్ వెళ్లి అక్కినేనిని కలసి వచ్చేవారు. పట్టణానికి చెందిన ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్‌వీ కృష్ణారావు కన్వీనరుగా 1999 ఆగస్టు 28వ తేదీన ఇక్కడి పాత రాజ్యం టాకీస్‌లో నిర్వహించిన శ్రీ మద్దూరి కృష్ణమూర్తి స్మారక రాష్ట్రస్థాయి పద్య నాటక పోటీలను అక్కినేని ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఆదరణ మరువలేనిది..
చిలకలూరిపేట : కళాకారుల్లో చిన్న పెద్ద కళాకారులు ఉండరు.. మనమంతా కళాకారుల కుటుంబమే.. అంటూ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు అన్న మాటలను గుర్తుకు తెచ్చుకున్నారు ప్రముఖ రంగస్థల నటుడు, రచయిత విడదల సాంబశివరావు. మట్టిమనిషి టీవీ సీరియల్‌లో ఆయనతో పాటు ప్రధానపాత్రలో నటించిన సాంబశివరావు అక్కినేని మరణవార్త జీర్ణించుకోలేకపోతున్నారు. ‘టీవీలో సీరియల్‌లో పని చేసేటప్పుడు రెండేళ్లు ఆయనతో కలిసి ఉన్నా. ఆయనతో కలిసి నటించిన అనుభవం ఎప్పటికీ మరచిపోలేనిది..’ అన్నారు.
‘నా జన్మభూమి..’ అని పాడింది ఇక్కడే..
దుగ్గిరాల, న్యూస్‌లైన్: సినీనటుడు అక్కినేని నాగేశ్వరరావు నటనను ప్రత్యక్షంగా చూసే అవకాశం దుగ్గిరాల మండల ప్రజలకు దక్కింది. 1969 సంవత్సరంలో ‘సిపాయి చిన్నయ్య ’ చిత్రంలోని ‘నా జన్మభూమి ఎంతో అందమైన దేశమూ.. హైహై నాసామి రంగా..’ అనే పాటలోని కొన్ని సన్నివేశాలను దుగ్గిరాల ప్రాంతంలో చిత్రీకరించారు. దుగ్గిరాల నీటిపారుదల శాఖకు చెందిన బంగ్లా ప్రాంతంలోను, మంచికలపూడి పెట్రోలు బంకు సమీపంలో, రేవేంద్రపాడు కాలువకట్ట సమీపంలో నాలుగురోజుల పాటు చిత్రీకరించారు. ఈ సమయంలో మండలం చుట్టుపక్కల ప్రాంతాలను ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి అక్కినేనిని చూశారు. మంచికలపూడి వద్ద వంగిన తాడి చెట్టు ఎక్కి దూకుతూ తీసిన సన్నివేశం, రేవేంద్రపాడు వంతెన సమీపంలో నాగలితో దున్నటం, నాట్లు వేయించిన సన్నివేశాలు తీశారు. నాట్లు వేసే సీన్‌లో రేవేంద్రపాడు మహిళలు పాల్గొన్నారు. రేవేంద్రపాడు గ్రామానికి చెందిన జమిందారు మొక్కపాటి వెంకటేశ్వరరావు భవనంలో పప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి, పెరుగుతో ఆయన భోంచేశారు అని పెద్దలు గుర్తు చేసుకున్నారు.
ఏఎన్‌ఆర్‌ను ప్రత్యక్షంగా చూసిన వారి చూసిన అనుభవాలు వారి మాటల్లో..
తృప్తిగా భోంచేశారు..
షూటింగ్ జరుగుతున్నప్పుడు మా గ్రామంలో ఎవరో భోజనానికి రమ్మన్నారట. వచ్చాక వాళ్లెవరు పట్టించుకోలేదట. ఈ సమయంలో గ్రామస్తులు చెప్పటంతో ఏఎన్‌ఆర్ మా ఇంటికి వచ్చారు. సరాసరి వరండాలోకి వచ్చి కూర్చున్నారు. అయ్యో తెలియకుండా వచ్చారే.. నాకు తెలియదు గదా అని నేనన్నాను. అప్పుడు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ‘రైతుల ఇళ్ళల్లో సంవత్సరం పొడవునా ఉండే ఆవకాయ పచ్చడి అంటే నాకు ఇష్టం వాటితో భోజనం పెట్టండమ్మా..’ అన్నారు. అప్పుడు వెంటనే భోజనం సిద్ధం చేసి పప్పు, మామిడికాయ పచ్చడి, నెయ్యి, పెరుగుతో భోజనం వడ్డించాను. తృప్తిగా భోంచేసి, చాలా బాగుందమ్మా అన్నారు.
- మొక్కపాటి శేషకుమారి, రేవేంద్రపాడు
ఎంతో ఆనందాన్నిచ్చింది..
1969లో రుమేనియా దేశానికి చెందిన యూనివర్సల్ 500 ట్రాక్టర్‌ను కొనుగోలు చేశాను. ఏపీజీ 8600 నంబ రు వచ్చింది. అప్పుడే రేవేంద్రపాడులో అక్కినేని నటించిన సిపాయి చిన్నయ్య చిత్రం షూటింగ్ జరుగుతోంది. ట్రాక్టర్ నడిపే సన్నివేశం కోసం పాత ట్రాక్టర్ టాపు తీసి సిద్ధం చేస్తున్నారు. విషయం తెలుసుకున్న మా పిల్లలు కొత్తగా వచ్చిన మా ట్రాక్టర్‌ను తీసుకొచ్చారు. దాన్ని అక్కినేని నడిపారు. ఎంతో ఆనందాన్నిచ్చింది. - కుర్రే వెంకటరెడ్డి, నూతక్కి
గుంటూరు గడ్డపై..
1953లో బతుకుదెరువు చిత్ర విజయోత్సవ సభకు గుంటూరు వచ్చి న ఏఎన్‌ఆర్ నగర ప్రజల అభిమానాన్ని అందుకున్నారు.
1955లో సంతానం చిత్ర విజయోత్సవానికి కృష్ణమహల్ థియేటర్‌కు వచ్చారు.
1956 ఇలవేల్పు చిత్ర విజయోత్సవంలో, 1957లో నగర పౌర సన్మానం అందుకున్నారు.
అమరశిల్పి జక్కన్న, మూగమనసులు చిత్రాల వంద రోజుల విజయోత్సవాలకు నగరానికి విచ్చేశారు.
1988లో ఏసీ న్యాయ కళాశాలలో ఏఎన్‌ఆర్‌కు సన్మానం జరిగింది.
1991లో మారుతీనగర్‌లోని మారుతీదేవాలయంలో నటుడు ధూళిపాళ్ళ నిర్మించిన కల్యాణ మండపాన్ని ప్రారంభించారు.
1993లో నాటి 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ రాయపాటి సాంబశివరావు ఏఎన్నార్‌ను స్వర్ణకిరీటంతో సత్కరించారు.
1996లో విజయకృష్ణా హోటల్‌లో ఆయన వీరాభిమానులు ఆయనను ఘనంగా సత్కరించారు.