
హీరో.. హీరోయిన్.. ఓ చెట్టు..
సమ్‌థింగ్ స్పెషల్
నా చిన్నతనంలో మా ఊరికి అక్కినేని నాగేశ్వరరావు వచ్చారు. ఈ చెట్టు కిందే షూటింగ్ జరిపారు. ఆయనతో షేక్‌హ్యాండ్ ఇచ్చిన సంఘటన ఇప్పటికీ మరిచిపోలేను. మట్టిపిడతలో అన్నం వండించుకుని నాగేశ్వరరావుగారు తినేవారు. మా చెట్టు వల్ల ఎంతో మంది సినీ ప్రముఖులను చూసే అదృష్టం కలిగింది.
- నీరుకొండ లక్ష్మణరావు, స్థానికుడు
మా నిద్రగన్నేరుచెట్టు మా గ్రామానికే తొలిమెట్టు. ఇక్కడ ఎంతో మంది ప్రముఖులు పలు సన్నివేశాల్లో నటించారు. ఏడాదిలో రెండు మూడు షూటింగులన్నా మా గ్రామంలో జరుగుతాయి. ఇటీవల అల్లరి నరేష్ నటించిన బందిపోటు సినిమా ఇక్కడ షూటింగు జరుపుకున్నదే!
- బోగవెళ్లి బ్రహ్మానందం, స్థానికుడు