![Revenue Conferences Postponed to September: Andhra Pradesh](/styles/webp/s3/article_images/2024/08/14/Transfers%20of%20employees.jpg.webp?itok=NH0eaoQG)
సాక్షి, అమరావతి: ఉద్యోగుల బదిలీల కారణంగా రెవెన్యూ సదస్సులను వాయిదా వేస్తున్నట్టు రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ చెప్పారు. మంగళవారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 16 నుంచి ప్రారంభించాల్సిన సదస్సులను సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహిస్తున్నట్టు ప్రకటించారు.
ఈ సదస్సుల్లో మొదటి 45 రోజులు భూ వివాదాలు, రీ–సర్వే తప్పిదాలకు సంబంధించి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తామన్నారు. అనంతరం 45 రోజుల్లో అర్జీలపై చర్యలు తీసుకుని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూముల విషయంలో మోసపూరిత రిజిస్ట్రేషన్లు జరిగినట్టు ప్రభుత్వం దృష్టికి వచ్చిందన్నారు. ‘ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చనే’ పద్ధతి తీసుకురావడంతో కొన్ని మోసపూరిత రిజిస్ట్రేషన్లు జరిగినట్టు గుర్తించామన్నారు. ఇలాంటి వాటిపై విచారణ జరిపి నిజమైన అసైనీలకు న్యాయం చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment