న్యూఢిల్లీ, సాక్షి: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై ఉత్కంఠ కొనసాగనుంది. సీబీఐ అరెస్ట్ వ్యవహారంలో ఆమె వేసిన బెయిల్ పిటిషన్‌పై తీర్పును గురువారం ఉదయం వాయిదా వేసింది సీబీఐ ప్రత్యేక స్థానం.
లిక్కర్ స్కాం కేసులో ఈడీ, సీబీఐ అరెస్టులపై బెయిల్ కోరుతూ కవిత తరఫున వేర్వేరు పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే ఇవాళ సీబీఐ అరెస్ట్ వ్యవహారంపై ఆమె వేసిన పిటిషన్‌పై తీర్పు వెలువడాల్సి ఉంది. అయితే.. ఆ తీర్పును మే 6వ తేదీకి వాయిదా వేసింది ప్రత్యేక కోర్టు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఒకేరోజు వేర్వేరుగా తీర్పులు ఇస్తామని స్పెషల్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా స్పష్టం చేశారు.
ఇక.. లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తనను అక్రమంగా అరెస్టు చేసిందని బెయిల్ కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. విచారణలో భాగంగా లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదనలు వినిపించింది. ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని సీబీఐ చెప్పుకొచ్చింది. ఆమె బయటకు వస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు.. ఈ కేసు రాజకీయ కక్షతో మాత్రమే పెట్టారని కవిత తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. కేవలం అప్రూవర్ల స్టేట్మెంట్లని ఆధారంగా చేసుకుని అరెస్టు చేశారని అన్నారు. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలులేవని వాదనలు వినిపించారు.
ఈడీ బెయిల్ పిటిషన్‌పై వాడీవేడి వాదనలు
ఇక.. ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ కవిత మొదట్లో మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. అయితే వాదనల అనంతరం కోర్టు దానిని తిరస్కరించింది. దీంతో ఆమె రెగ్యులర్ బెయిల్ పిటిషన్ వేశారు. పిటిషన్‌పై వాదనలు విన్న రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసి.. మే 6వ తేదీన వెల్లడిస్తామని తెలిపింది.
విచారణ సందర్భంగా.. ఈడీ తనను అక్రమంగా అరెస్ట్ చేసిందని కవిత తరఫు న్యాయవాది వాదించారు. అయితే కవితను సెక్షన్ 19 కింద చట్టబద్దంగా అరెస్టు చేశామని.. అక్రమంగా అరెస్టు చేశారనే దానిలో పసలేదని ఈడీ వెల్లడించింది. ఈ కేసులో క్విడ్ ప్రోకో జరిగిందన్నారు. రూ. 581 కోట్లు హోల్ సేల్ వ్యాపారులు సంపాదించారని... అయిదు నుంచి 12 శాతానికి కమీషన్ పెంచారన్నారు. దానివల్ల ప్రభుత్వానికి, ప్రజలకు నష్టం జరిగిందని తెలిపారు. ఈ పాలసీలో ఇండో స్పిరిట్‌కు మేజర్ షేర్ దక్కిందని.,. దీని ద్వారా ఈ అక్రమాలకు పాల్పడ్డారని వెల్లడించారు.
పాత పాలసీని పక్కన పెట్టి అక్రమ సంపాదన కోసం కొత్త పాలసీ తెచ్చారని చెప్పారు. విజయ్ నాయర్, మనీష్ సిసోడియా ద్వారా బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై కథ నడిపారన్ నారు. విజయ్ నాయర్ మద్యం వ్యాపారులతో సమావేశాలు ఏర్పాటు చేశారని.. అసాధారణ లాభాలు గడించారని కోర్టుకు విన్నవించారు. బలవంతంగా మహదేవ్ డిస్ట్రిబ్యూటర్ నుంచి పక్కకు తప్పించారన్నాు. ఈ కేసులో మనీష్ సిసోడియా, కేజ్రీవాల్‌కు బెయిల్ దక్కలేదని కోర్టుకు తెలిపారు. దాదాపు రెండు గంటలపాటు ఈడీ తరఫు న్యాయవాది జోహెబ్ హుస్సేన్ వాదనలు వినిపించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment