సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు రౌస్ అవెన్యూ కోర్టు తుది తీర్పు వెల్లడించనుంది. దీంతో, కవిత నేడు జైలు నుంచి బయటకు వస్తుందా? లేదా అనే సస్పెన్స్ నెలకొంది.
ఇక, లిక్కర్ స్కాం కేసులో సీబీఐ తనను అక్రమంగా అరెస్టు చేసిందని, తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని గతంలో ఆమె పిటిషన్ దాఖలు చేయగా న్యాయస్థానం తిరస్కరించింది. ఆ తర్వాత సాధారణ బెయిల్ కోసం మరోసారి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తుది తీర్పు వెలువడనుంది. కాగా, కవిత పిటిషన్ విచారణ సందర్భంగా వాడీవేడి వాదనలు కొనసాగాయి.
విచారణలో భాగంగా లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ వాదనలు వినిపించింది. ఈ కేసులో కవితే ప్రధాన కుట్రదారు అని సీబీఐ చెప్పుకొచ్చింది. ఆమె బయటకు వస్తే సాక్షాలను ధ్వంసం చేసే అవకాశం ఉందని, సాక్షులను బెదిరించే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు.. ఈ కేసు రాజకీయ కక్షతో మాత్రమే పెట్టారని కవిత తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు. కేవలం అప్రూవర్ల స్టేట్మెంట్లని ఆధారంగా చేసుకుని అరెస్టు చేశారని అన్నారు. కవితకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాలులేవని వాదనలు వినిపించారు.
Comments
Please login to add a commentAdd a comment